Asian Para Games 2026: భారత్‌కు డబుల్ ధమాకా.. ఒకే ఈవెంట్‌లో స్వర్ణం, రజతం!
ఆసియా పారా గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. అద్వితీయమైన ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాలను కైవసం చేసుకుంటున్నారు. సోమవారం ఉదయం మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో భారత షూటర్లు మోనా అగర్వాల్, అవని లేఖరా తొలి రెండు స్థానాల్లో నిలిచి బంగారు, వెండి పతకాలను అందించారు.
ఆ వెంటనే పురుషుల J1 -70kg బ్లైండ్ జుడో కేటగిరిలో భారత అథ్లెట్ కపిల్ పర్మార్ కాంస్య పతకాన్ని అందుకున్నాడు. సెమీఫైనల్లో అతను ఇండోనేషియాకు చెందిన ఇప్పాన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. లాంగ్ జంప్‌లో నిషద్ కుమార్ స్వర్ణం సాధించాడు. ఈ ఈవెంట్‌లో 7.11 మీటర్ల దూరం దూకి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు.
తాజాగా జావెలిన్ త్రో, 1500 మీటర్ల పరుగు పందెంలో భారత అథ్లెట్లు తొలి రెండు స్తానాల్లో నిలిచి బంగారు, వెండి పతకాలను గెలుచుకున్నారు. సోమవారమే జరిగిన పురుషుల F46 జావెలిన్ త్రో గేమ్‌లో రింకూ ఈటెను 65.11 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకున్నాడు. ఇదే ఈవెంట్‌లో అజిత్ సింగ్ ఈటెను 65.02 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచి వెండి పతకాన్ని అందుకున్నాడు.

మహిళల 1500 మీటర్ల T12/13 కేటగిరిలో సౌమ్య కుమార్, రాధా వెంకటేష్ టాప్-2లో నిలిచి పసిడి పతకంతో పాటు సిల్వర్ మెడల్ అందుకున్నారు. దాంతో భారత్ పతకాల సంఖ్య 4 స్వర్ణాలు 3 రజతాలు, ఒక కాంస్యంతో 8కి చేరింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


