Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన శీతల్ దేవి.. వరల్డ్ రికార్డు సమం, ఆసియా రికార్డు బ్రేక్!

భారత స్టార్ ఆర్చర్ శీతల్ దేవి విలువిద్యలో మరోసారి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా పారా గేమ్స్ క్వాలిఫికేషన్ రౌండ్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆమె.. 720 పాయింట్లకు గాను ఏకంగా 704 పాయింట్లు సాధించింది. ఈ అద్భుత ప్రదర్శనతో ప్రపంచ రికార్డును సమం చేయడమే కాకుండా సరికొత్త ఆసియా రికార్డును, ఆసియా గేమ్స్ రికార్డును తన పేరిట లిఖించుకుంది. గతంలో ఆసియా రికార్డు 698 పాయింట్లుగా ఉండగా.. శీతల్ దేవి దానిని తుడిచిపెట్టేసి అగ్రస్థానంలో నిలిచింది.

IND vs ZIM: మేం గెలిచినా.. ఆ విషయంలో మెరుగవ్వాలి: స్మృతి మంధాన

IND vs ZIM: మేం గెలిచినా.. ఆ విషయంలో మెరుగవ్వాలి: స్మృతి మంధాన

పారా కాంపౌండ్ మహిళల ర్యాంకింగ్ రౌండ్‌లో శీతల్ దేవి ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆమె సంధించిన బాణాలలో 32 పర్ఫెక్ట్ 'X'లు, మరో 25 బాణాలకు పూర్తి 10 పాయింట్లు సాధించింది. అంటే మొత్తం 57 బాణాలకు గరిష్ట పాయింట్లు సాధించి 704 పాయింట్ల భారీ స్కోరుతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో శీతల్ దేవి తదుపరి రౌండ్‌కు ఎంతో ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్లింది.

Indian Para Archer Sheetal Devi Equals World Record and Sets Asian Record at Asian Para Games

మరోవైపు తొలిసారి ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేసిన భారత ఆర్చర్ పాయల్ నాగ్ కూడా అద్భుత ప్రదర్శన చేసింది. ర్యాంకింగ్ రౌండ్‌లో పాయల్ నాగ్ 12 'X'లు, 20 పది పాయింట్లతో కలిపి మొత్తం 675 స్కోరు సాధించి 5వ స్థానంలో నిలిచింది. అరంగేట్ర మ్యాచ్‌లోనే ఈ స్థాయిలో రాణించి అందరి దృష్టినీ ఆకర్షించింది.

IND vs WI: ఇషాన్ కిషన్ ఊచకోత బుగ్గిపాలు.. ఆఖరి టీ20 రద్దు!

Also Read

IND vs WI: ఇషాన్ కిషన్ ఊచకోత బుగ్గిపాలు.. ఆఖరి టీ20 రద్దు!

శీతల్ దేవి, పాయల్ నాగ్‌లతో కూడిన భారత కాంపౌండ్ మహిళల డబుల్స్ టీమ్ కూడా సరికొత్త రికార్డును నెలకొల్పింది. వీరిద్దరూ కలిపి మొత్తం 1379.. అంటే శీతల్ 704 పాయింట్లు, పాయల్ నాగ్ 675 పాయింట్లు సాధించి డబుల్స్ ర్యాంకింగ్ రౌండ్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఈ జోడీ అక్టోబర్ 20న ఉదయం 11.15 గంటలకు ప్రారంభమయ్యే పారా కాంపౌండ్ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ పోరులో తలపడనుంది.

Story first published: Monday, October 19, 2026, 10:16 [IST]
Other articles published on Oct 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+