Asian Games 2026: ఒక్కడే 7 బంగారు పతకాలు గెలిచాడు!
చైనా స్విమ్మర్ జాంగ్ ఝూన్షువో చరిత్ర సృష్టించాడు. ఆసియా గేమ్స్ 2026లో ఏకంగా ఏడు బంగారు పతకాలు సాధించాడు. దాంతో ఒకే టోర్నీలో అత్యధిక గోల్డ్ మెడల్స్ గెలిచిన స్విమ్మర్‌గా చరిత్రకెక్కాడు. ఆసియా గేమ్స్‌లో ఈ చైనా స్విమ్మర్ 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, 1500 మీటర్లు ఫ్రీ స్టైల్‌తో పాటు త్రీ రిలే ఈవెంట్లలో జాంగ్ ఝూన్సువో పతకాలు సాధించాడు.
400 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో 3 నిమిషాల 41.28 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 7వ బంగారు పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. 200 మీటర్ల ఫ్రీస్టైల్ కేటగిరిలో 1:43.49 నిమిషాల సమయంలో పూర్తి చేసి నయా ఆసియా రికార్డ్‌ను నమోదు చేశాడు.
800 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ రేసును 7 నిమిషాల 42.49 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. 1500 మీటర్ల ఫ్రీస్టైల్ కేటగిరిలో 14 నిమిషాల 42.42 సెకన్లలో వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసి విజేతగా నిలిచాడు.

4 × 200 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో జపాన్ జట్టును అధిగమించి చైనా జట్టుకు ఆసియా రికార్డుతో స్వర్ణం అందించాడు. 4 × 100 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో 800 మీటర్ల రేస్ ముగిసిన కొన్ని నిమిషాల్లోనే ఈ రిలే రేస్‌లో పాల్గొని చైనాకు ఆసియా రికార్డుతో పసిడిని అందించాడు. 4 × 100 మీటర్ల మిక్స్‌డ్ రిలేలోనూ విజేతగా నిలిచాడు.
ఈ ఎడిషన్‌లో భారత్(4) సాధించిన బంగారు పతకాల కంటే కూడా ఈ చైనా అథ్లెట్ స్వర్ణాలే ఎక్కువ కావడం గమనార్హం. ఓవరాల్‌గా ఈ టోర్నీలో 37 దేశాల కంటే ఎక్కువ జాంగ్ ఝూన్షువో బంగారు పతకాలు గెలిచాడు. 7వ స్వర్ణం గెలిచిన అనంతరం సంతోషం వ్యక్తం చేసిన జాంగ్ ఝూన్షువో.. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే తన లక్ష్యమని చెప్పాడు.
ఈ రోజు తన కెరీర్‌లో ఒక పరిపూర్ణమైన ముగింపులా అనిపిస్తోందని పేర్కొన్నాడు. 7 స్వర్ణాలు గెలిచిన జాంగ్ ఝూన్షువోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గజ ఈతగాడని కామెంట్ చేస్తున్నారు. 133 బంగారు పతకాలు, 53 రజతాలు, 45 కాంస్య పతకాలతో చైనా అగ్రస్థానంలో ఉండగా.. జపాన్ 41 స్వర్ణాలు, 68 రజతాలు, 63 కాంస్యాలతో రెండో స్థానంలో నిలిచింది. 4 స్వర్ణాలతో భారత్ 12వ స్థానంలో కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


