Asia Games 2026 విజేతలకు సీఎం విజయ్ భారీ క్యాష్ ప్రైజ్!
ఆసియా గేమ్స్ 2026లో పతకాలు సాధించిన తమిళనాడు అథ్లెట్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ భారీ క్యాష్ రివార్డ్స్ ప్రకటించారు. అథ్లెట్ల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడంలో తమిళనాడు ప్రభుత్వం ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలే రేసులో భారత్‌కు రజత పతకం అందించిన జట్టులోని తమిళనాడు అథ్లెట్లు విద్య రామరాజ్, విశాల్‌లకు చెరో రూ. 50 లక్షల క్యాష్ రివార్డ్స్ అందజేస్తామని తమిళనాడు సీఎమ్‌ఓ ఎక్స్ వేదికగా వెల్లడించింది. తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (SDAT)కి చెందిన 'ఎలైట్ స్పోర్ట్స్‌పర్సన్ స్కీమ్' కింద ఈ ఆర్థిక సాయం అందివ్వనుంది.
ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టులోని తమిళనాడు యువ క్రీడాకారిణి జి. కమలినికి విజయ్ రూ. 75 లక్షల నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే.

'4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో సిల్వర్ మెడల్ గెలిచిన భారత అథ్లెట్లకు అభినందనలు. నలుగురు సభ్యులున్న భారత జట్టులో ఇద్దరు తమిళనాడుకు చెందిన క్రీడాకారులు ఉండటం రాష్ట్ర క్రీడా రంగానికి గర్వకారణం. విద్య రామరాజ్, విశాల్ సాధించిన ఈ విజయం యువతకు గొప్ప స్ఫూర్తినిస్తుంది. భవిష్యత్తులోనూ ఈ ఇద్దరూ మరిన్ని విజయాలు సాధించి తమిళనాడుతో పాటు భారత్‌కు మంచి పేరు తీసుకురావాలి.' అని సీఎం విజయ్ పేర్కొన్నారు.
4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలే విభాగంలో విద్య రామరాజ్, విశాల్, మను, పూవమ్మలతో కూడిన భారత బృందం 3:14.46 సెకన్లలో రేసును పూర్తి చేసి సిల్వర్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. బహ్రెయిన్ జట్టు 3:12.87 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల మిక్స్‌డ్ రిలే విభాగంలో భారత్‌కు ఇది వరుసగా మూడో పతకం కావడం విశేషం. 2018లో స్వర్ణం, 2022లో రజతం గెలిచిన భారత జట్టు, మరోసారి రజత పతకం సాధించింది. ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 21కి చేరింది. శుక్రవారం భారత్‌కు నాలుగు పతకాలు వరించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


