Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: మ్యాచ్ రద్దు.. సెమీస్‌లో అడుగుపెట్టిన టీమిండియా

IND vs AFG: జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. నిషిన్ నగరంలో ఉన్న కొరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ పోరు వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా భారత జట్టు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది.

ఒక్క మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు చేరిన పాకిస్తాన్!

ఒక్క మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు చేరిన పాకిస్తాన్!

వర్షార్పణమైన క్వార్టర్ ఫైనల్ పోరు
సోమవారం నాటి మ్యాచ్‌లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం, తడిసిన ఔట్ ఫీల్డ్ కారణంగా కనీసం టాస్ వేసేందుకు కూడా పరిస్థితులు అనుకూలించలేదు. గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా, ఈ సారి కూడా పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగింది. అయితే స్టేడియంలో ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దయినా నిబంధనల ప్రకారం భారత్ టోర్నీలో ముందడుగు వేసింది.

IND vs AFG Match Abandoned Due to Rain India Qualify for Asian Games 2026 Semifinals Full Details Here

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌తో లభించిన అర్హత
ఆసియా క్రీడల నిబంధనల ప్రకారం వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే రిజర్వ్ డే లేకపోవడంతో ఉన్నత ర్యాంకింగ్ ఉన్న జట్టుకే విజయం దక్కుతుంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో భారత జట్టు అగ్రస్థానంలో ఉండగా.. ఆఫ్ఘనిస్తాన్ 10వ స్థానంలో ఉంది. ఈ మెరుగైన ర్యాంకింగ్ ఆధారంగా భారత్ సెమీస్‌కు అర్హత సాధించింది. కాగా భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడే అవకాశం పొందాయి.

అందువల్లే ఓటమి.. నిర్వాహకుల తీరుపై మండిపడ్డ పీవీ సింధు!

Also Read

అందువల్లే ఓటమి.. నిర్వాహకుల తీరుపై మండిపడ్డ పీవీ సింధు!

సెమీఫైనల్లో భారత్ ఎవరితో తలపడనుంది?
అక్టోబర్ 1న జరగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక, నేపాల్ మధ్య జరిగే మూడో క్వార్టర్ ఫైనల్ విజేతతో భారత్ తలపడనుంది. మరోవైపు హంగ్‌కాంగ్‌తో మ్యాచ్ వర్షంతో రద్దవ్వడంతో ఇప్పటికే సెమీస్ చేరిన పాకిస్తాన్.. అక్టోబర్ 1న బంగ్లాదేశ్ లేదా మలేషియాతో మొదటి సెమీఫైనల్లో పోరాడనుంది.

మ్యాచ్‌ల తదుపరి షెడ్యూల్
*సెప్టెంబర్ 29: శ్రీలంక vs నేపాల్ (ఉదయం 5.30 గంటలకు)

*సెప్టెంబర్ 29: బంగ్లాదేశ్ vs మలేషియా (ఉదయం 10 గంటలకు)

*అక్టోబర్ 1: మొదటి సెమీఫైనల్ - పాకిస్థాన్ వర్సెస్ TBC (ఉదయం 5:30 గంటలకు)

*అక్టోబర్ 1: రెండవ సెమీఫైనల్ - భారత్ వర్సెస్ TBC (ఉదయం 10:00 గంటలకు)

*అక్టోబర్ 3: కాంస్య పతక పోరు (ఉదయం 5:30 గంటలకు), ఫైనల్/స్వర్ణ పతక పోరు (ఉదయం 10:00 గంటలకు)

Story first published: Monday, September 28, 2026, 10:22 [IST]
Other articles published on Sep 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+