Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: తమిళనాడులో క్యాష్ రివార్డ్స్.. సన్మానాలతో సరిపెట్టిన తెలుగు రాష్ట్రాలు!

ఆసియా గేమ్స్ 2026 పతకాలు సాధించిన అథ్లెట్లకు తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటిస్తే.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం సన్మానాలతో సరిపెట్టాయి. తమిళనాడు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ఆ రాష్ట్రానికి చెందిన అథ్లెట్లు ఆసియా గేమ్స్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చారు. సుమారు 37 మంది అథ్లెట్లు 11 రకాల క్రీడా విభాగాల్లో పోటీపడి 18 పతకాలు సాధించారు.

ఇందులో 2 స్వర్ణాలు, 3 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. పతకాలు సాధించిన అథ్లెట్లకు తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. స్వర్ణ పతక విజేతలకు రూ.75 లక్షలు, సిల్వర్ మెడలిస్ట్‌లకు రూ.50 లక్షలు, కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారులకు రూ.30 లక్షల క్యాష్ రివార్డ్స్ అందజేసింది. సీఎం జోసెఫ్ విజయ్ స్వయంగా ఈ క్యాష్ రివార్డ్స్‌ను అథ్లెట్లకు అందజేశారు.కానీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించాయి.

IND vs WI: అయ్యర్, గంభీర్‌కు కామన్‌సెన్స్ లేదు: అశ్విన్

IND vs WI: అయ్యర్, గంభీర్‌కు కామన్‌సెన్స్ లేదు: అశ్విన్

బోకేలతో సరిపెట్టిన తెలుగు సీఎంలు..

తెలంగాణ నుంచి ఏడుగురు ఆటగాళ్లు మాత్రమే ఆసియా గేమ్స్‌లో బరిలోకి దిగగా.. ఆరు పతకాలు వచ్చాయి. ఈ ఐదింటిలో ఆర్చర్ చికితా తానిపర్తి.. మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్, మిక్స్‌డ్ కాంపౌండ్ ఆర్చరీ టీమ్‌లో రెండు స్వర్ణాలు సాధించగా.. క్రికెట్ టీమ్ తరఫున తిలక్ వర్మ, అరుంధతి రెడ్డిలు చెరో స్వర్ణాన్ని అందుకున్నారు.

Asian Games 2026 Tamil Nadu Announces Cash Incentives Raising Questions About Telugu States Rewards

షూటింగ్‌లో ఈషా సింగ్ రజతం గెలవగా.. బ్యాడ్మింటన్‌లో తరుణ్ మానెపల్లి కాంస్యం సాధించాడు. అయితే మెడల్స్ సాధించిన విజేతలకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి క్యాష్ రివార్డ్స్ ప్రకటించలేదు. సన్మానాలతో సరిపెట్టి ఒలింపిక్స్‌లో సత్తా చాటేలా ప్రోత్సాహిస్తామని మాత్రమే చెప్పింది.

IND vs WI: ఆఖరి టీ20లో భారత్ గెలవాలంటే అతన్ని జట్టులోకి తీసుకోవాలి: మాజీ క్రికెటర్

Also Read

IND vs WI: ఆఖరి టీ20లో భారత్ గెలవాలంటే అతన్ని జట్టులోకి తీసుకోవాలి: మాజీ క్రికెటర్

8 పతకాలు సాధించిన ఏపీ అథ్లెట్లు..

ఆంధ్రప్రదేశ్ నుంచి 16 మంది క్రీడాకారులు ఆసియా గేమ్స్‌లో బరిలోకి దిగగా.. 3 రకాల క్రీడల్లో 3 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 8 పతకాలను సాధించారు. స్వర్ణం గెలిచిన మహిళా క్రికెట్ టీమ్‌లో కడపకు చెందిన శ్రీచరణి భాగంగా ఉండగా.. మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో విజయవాడకు చెందిన వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణం సాధించింది .

రాజమండ్రికి చెందిన గణేష్‌ మణిరత్నం పురుషుల కాంపౌండ్ టీమ్ ఆర్చరీ విభాగంలో స్వర్ణం, వ్యక్తిగత కాంపౌండ్ ఆర్చరీ కేటగిరిలో కాంస్య పతకం సాధించాడు. విజయవాడకు చెందిన ఆర్చర్‌ బొమ్మదేవర ధీరజ్‌ రీకర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రజత పతకం, పురుషుల రీకర్వ్ టీమ్ ఈవెంట్‌లో మరో రజత పతకం సాధించాడు.

అండగా ఉంటానన్న సీఎం చంద్రబాబు..

ఈ మెడల్స్ విజేతలను సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో రాష్ట్రం నుంచి మరింత మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా ప్రభుత్వం తరఫున పూర్తి ప్రోత్సాహం, అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఎలాంటి క్యాష్ రివార్డ్స్ ప్రకటించలేదు. తమిళనాడు తరహాలో తెలుగు అథ్లెట్లకు కూడా క్యాష్ రివార్డ్స్ ఇస్తే బాగుండేదని. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేలా అయినా ప్రోత్సాహించాలని క్రీడా ప్రేమికులు కోరుకుంటున్నారు.

Story first published: Friday, October 16, 2026, 15:38 [IST]
Other articles published on Oct 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+