IND vs WI: ఆఖరి టీ20లో భారత్ గెలవాలంటే అతన్ని జట్టులోకి తీసుకోవాలి: మాజీ క్రికెటర్
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలంటే తుది జట్టులోకి కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవాలని మాజీ క్రికెటర్ వరుణ్ ఆరోన్ అన్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే చిన్నస్వామి స్టేడియంలో రక్షణాత్మకంగా బౌలింగ్ చేయడం కంటే వికెట్లు తీయగల బౌలర్లే కావాలని అభిప్రాయపడ్డాడు.
బుధవారం ఉప్పల్ వేదికగా ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. దాంతో శనివారం బెంగళూరు వేదికగా జరిగే ఆఖరి టీ20కి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సిరీస్ దక్కనుంది.
కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలి..
ఈ క్రమంలోనే మ్యాచ్ విన్నర్ అయిన కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని వరుణ్ ఆరోన్.. టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు. యుజ్వేంద్ర చాహల్ వంటి మణికట్టు స్పిన్నర్లు చిన్నస్వామి స్టేడియంలో సత్తా చాటారని వరుణ్ ఆరోన్ గుర్తు చేశాడు. కేవలం పరుగులు నియంత్రించడంపైనే ఫోకస్ పెడితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు.

'ఆఖరి టీ20కి భారత్ ఐదుగురు ప్రధాన బౌలర్లతో బరిలోకి దిగాలి. ఏడో స్థానం వరకు బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు ఉన్నందున.. స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగడమే ఉత్తమం. రక్షణాత్మకంగా బౌలింగ్ చేస్తామంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసాడు. అతని స్థానంలో తర్వాతి రెండు మ్యాచ్‌లు ఆడిన ప్రిన్స్ యాదవ్ కేవలం ఒకే ఒక వికెట్ పడగొట్టాడు.
సరైన ప్రణాళికలు లేకుండా..
హైదరాబాద్ టీ20లో భారత బౌలర్లు సరైన ప్రణాళికలతో బరిలోకి దిగలేదు. పిచ్ స్వభావాన్ని గుర్తించి హార్డ్ లెంగ్త్‌లో బౌలింగ్ కొనసాగించాల్సింది. కానీ బౌండరీలు రాగానే భారత బౌలర్లు వెంటనే ఫుల్ లెంగ్త్‌లో వేయడం ప్రారంభించారు. దానిని విండీస్ బ్యాటర్లు అడ్వాంటేజ్‌గా మార్చుకున్నారు. భారీ సిక్సర్లు బాదారు.
మూడో మ్యాచ్‌లో షై హోప్‌కు అర్ష్‌దీప్ సింగ్ వేసిన లెంగ్త్ బాల్‌ను నాలుగో టీ20లో వేయలేకపోయాడు. సరైన ప్రణాళికలు రచించకపోవడంతోనే షై హోప్ అజేయ శతకంతో విండీస్‌ను గెలిపించాడు.'అని వరుణ్ ఆరోన్ అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


