Asian Games 2026: గోల్ఫ్‌లో డబుల్ ధమాకా.. చరిత్ర సృష్టించిన ప్రణవి ఉర్స్!
భారత గోల్ఫ్ ప్లేయర్ ప్రణవి ఉర్స్ చరిత్ర సృష్టించింది. ఆసియా గేమ్స్ చరిత్రలోనే వ్యక్తిగత గోల్ఫ్ విభాగంలో భారత్‌కు తొలి బంగారు పతకం అందించింది. అంతేకాకుండా మహిళల గోల్ఫ్ టీమ్ ఈవెంట్‌లో రజతం గెలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది. గంటల వ్యవధిలోనే ప్రణవి ఉర్స్ రెండు మెడల్స్ గెలిచి ఆకట్టుకుంది.
శనివారం జరిగిన వ్యక్తిగత గోల్ఫ్ ఈవెంట్ ఫైనల్లో సింగపూర్, చైనా అథ్లెట్లను వెనక్కి నెట్టి మరీ ప్రణవి ఉర్స్ ఈ విజయాన్ని అందుకుంది. మైసూరుకు చెందిన 23 ఏళ్ల ప్రణవి ఉర్స్.. ఫైనల్‌కు ముందు 195 స్కోర్‌తో మూడు షాట్స్ ఆధిక్యంలో నిలిచింది. కానీ ఆఖరి రౌండ్‌లోని మూడో హోల్‌లో చేసిన పొరపాటు ఆమె ఆధిక్యాన్ని కోల్పోయే ప్రమాదంలో పడేసింది.

చైనా, సింగపూర్ అథ్లెట్లు కూడా గట్టి పోటీ ఇచ్చారు. కానీ ప్రణవి అద్భుతంగా పుంజుకొని 6,10, 13వ హోల్స్‌లో బర్డీలతో మళ్లీ ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. 18వ హోల్‌లో బంతిని కొట్టి చైనా, సింగపూర్ అథ్లెట్లను వెనక్కి నెట్టి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
టీమ్ విభాగంలో రజతం..
ఇక గోల్ఫ్ టీమ్ విభాగంలో భారత్‌కు సిల్వర్ మెడల్ దక్కింది. ప్రణవి, అదితి అశోక్, దీక్షా దాగర్ త్రయం రెండో స్థానం నిలిచి, రజతం గెలిచింది. 2022లో జరిగిన ఆసియా గేమ్స్‌లో అతిది అశోక్.. గోల్ఫ్ మహిళల వ్యక్తిగత విభాగంలో రజతాన్ని సాధించింది. ఈ పతకమే మహిళల గోల్ఫ్‌లో భారత్‌కు ఏకైక మెడల్ కావడం గమనార్హం. ఈ సీజన్‌లో ప్రణవి ఏకంగా డబుల్ మెడల్స్ సాధించడం గమనార్హం.
ప్రణవి ఉర్సు ఎవరు..?
2003లో కర్ణాటకలోని మైసూరులో జన్మించిన ప్రణవి ఊర్స్.. 6 ఏళ్ల వయసులోనే గోల్ఫ్ ఆడటం ప్రారంభించింది. ఆమె జూనియర్, నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో పలు పతకాలను గెలుచుకుంది. 2020లో ప్రొఫెషనల్ గోల్ఫ్ ప్లేయర్‌గా మారింది. 2025లో పురుషుల ప్రొఫెషనల్ గోల్ఫ్ టోర్నీ గెలిచి తొలి భారతీయ మహిళగా నిలిచింది. చైనా వేదికగా జరిగిన గత ఆసియా గేమ్స్‌లో 13వ స్థానంలో, టీమ్ విభాగంలో 4వ స్థానంలో నిలిచి ప్రణవి ఉర్స్.. ఈసారి తన అద్భుతమైన ప్రతిభతో స్వర్ణ పతకం గెలిచిన భారత గోల్ఫ్ తన పేరును సువర్ణక్షరాలతో లిఖించుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


