Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: బంగ్లాదేశ్‌పై విజయం.. శ్రీలంకకు కాంస్యం!

ఆసియా గేమ్స్ 2026లో శ్రీలంక క్రికెట్ టీమ్ కాంస్య పతకం సాధించింది. శనివారం జరిగిన కాంస్య పోరులో సమష్టిగా రాణించిన శ్రీలంక 63 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది.

తారిండు రత్నాయకే(32 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 65) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. సాహన్ అరాచిగే(37 బంతుల్లో 3 ఫోర్లతో 33) టాప్ స్కోరర్‌గా పర్వలేదనిపించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్, సైఫ్ హసన్, మెహ్‌దీ హసన్ రెండేసి వికెట్లు తీయగా.. ఇస్లామ్, రిషాద్ హోస్సెన్ తలో వికెట్ పడగొట్టారు.

Asian Games 2026: అదిరిందయ్యా చంద్రం.. ఒకే రోజు 4 బంగారు పతకాలు!

Asian Games 2026: అదిరిందయ్యా చంద్రం.. ఒకే రోజు 4 బంగారు పతకాలు!
Asian Games 2026 Sri Lanka Clinch Bronze with 63-Run Win Over Bangladesh

అనంతరం బంగ్లాదేశ్ 17.3 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పర్వేజ్ హోస్సేన్(20), యాసిర్ అలీ(21), నాసమ్ అహ్మద్(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషారా(2/18), తారిండు రత్నాయకే(2/18), విజయ‌కాంత్ వియాస్కాంత్, వానుజా సాహన్ తలో రెండు వికెట్లు తీయగా.. సహన్, దుషాన్ హేమంత తలో వికెట్ పడగొట్టారు.

IND vs PAK: టాస్ గెలిచిన భారత్.. బరిలో టినేజ్ సెన్సేషన్!

Also Read

IND vs PAK: టాస్ గెలిచిన భారత్.. బరిలో టినేజ్ సెన్సేషన్!

శ్రీలంకను ఆదుకున్న తారిండు, సహాన్ అరచ్చిగే

బంగ్లాదేశ్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో 21 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ శ్రీలంకను తారిండు, సహాన్ ఆదుకున్నారు. అషెన్ బండారతో కలిసి ఐదో వికెట్‌కు 33 పరుగులు జోడించిన సహాన్.. తారిండుతో కలిసి ఆరో వికెట్‌కు 93 పరుగులు జోడించాడు. భారత్, పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్ అనంతరం గోల్డ్, సిల్వర్ మెడల్ విజేతలతో శ్రీలంక పోడియం పంచుకోనుంది.

Story first published: Saturday, October 3, 2026, 10:56 [IST]
Other articles published on Oct 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+