Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: అభిషేక్ శర్మ, తిలక్ వర్మ విధ్వంసం.. పాకిస్థాన్ ముందు భారీ లక్ష్యం

ఆసియా గేమ్స్‌ 2026లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత్ 212 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 61), తిలక్ వర్మ(22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.

చివర్లో శివమ్ దూబే(15బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) దూకుడుగా ఆడాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(21), ఇషాన్ కిషన్(20) పర్వాలేదనిపించారు. పాకిస్థాన్ బౌలర్లలో అరఫత్ మిన్హాస్(2/25) రెండు వికెట్లు తీయగా.. సైమ్ అయూబ్, అహ్మద్ డానియల్, అబ్రర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.

శభాష్ అభిషేక్.. నీపై విసిరిన రాళ్లను మైలురాళ్లుగా మార్చుకున్నావ్: యువరాజ్ సింగ్

శభాష్ అభిషేక్.. నీపై విసిరిన రాళ్లను మైలురాళ్లుగా మార్చుకున్నావ్: యువరాజ్ సింగ్

అభిషేక్ శర్మ విధ్వంసం..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. సాద్ మసూద్ వేసిన రెండో ఓవర్‌లో వైభవ్ వరుసగా రెండు సిక్స్‌లు బాదగా.. అభిషేక్ శర్మ ఓ సిక్స్, బౌండరీ తరలించాడు. దాంతో ఈ ఓవర్‌లో 24 పరుగులు వచ్చాయి. అయితే సైమ్ అయూబ్ వేసిన మరుసటి ఓవర్ తొలి బంతికే వైభవ్ సూర్యవంశీ(9 బంతుల్లో 2 సిక్స్‌లతో 15) షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

IND vs PAK Abhishek Sharma and Tilak Varma Fifties Help India Post 211 6 in Asian Games Final

వైభవ్ వెనుదిరిగినా.. అభిషేక్ శర్మ తన జోరును కొనసాగించాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. సంజూ శాంసన్(2) మరోసారి నిరాశపర్చినా..అభిషేక్ శర్మ భారీ సిక్స్‌లతో 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో అతను క్యాచ్ ఔట్‌ అయ్యాడు.

Asian Games 2026: చరిత్ర సృష్టించిన కుంకుమ్ మహోద్.. భారత్‌కు మరో స్వర్ణం!

Also Read

Asian Games 2026: చరిత్ర సృష్టించిన కుంకుమ్ మహోద్.. భారత్‌కు మరో స్వర్ణం!

తిలక్ వర్మ హాఫ్ సెంచరీ..

అనంతరం శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన ఆచితూచి ఆడారు. కానీ దూకుడుగా ఆడలేకపోయారు. దాంతో పరుగుల వేగం తగ్గింది. ఇషాన్ కిషన్‌ను అరఫత్ మిన్హాస్ క్లీన్ బౌల్డ్ చేయగా.. అయ్యర్‌ను అబ్రార్ అహ్మద్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, శివమ్ దూబే సెట్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకున్నా.. చివర్లో భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డారు. ఆఖరి ఓవర్‌లో శివమ్ దూబే ఔటైనా.. తిలక్ వర్మ రెండు భారీ సిక్స్‌లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో భారత్ 211 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. ఈ ఆసియా గేమ్స్‌లో ఇదే రికార్డ్ స్కోర్ కావడం గమనార్హం.

Story first published: Saturday, October 3, 2026, 11:50 [IST]
Other articles published on Oct 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+