Asian Games 2026: భారత్‌కు మరో స్వర్ణం.. చరిత్ర సృష్టించిన నీరూదండా!
ఆసియా గేమ్స్ 2026లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. 11వ రోజు అయిన బుధవారం భారత్‌కు వరుసగా మూడు స్వర్ణాలు దక్కాయి. ఆర్చర్ అథ్లెట్లు రెండు స్వర్ణాలు సాధించగా.. షూటింగ్‌లో నీరూదండా, కైనాన్ చెనైతో కలిసి ట్రాప్ మిక్స్‌డ్ షూటింగ్ టీమ్ విభాగంలో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.
ఫైనల్లో భారత్ ద్వయం తడబడినప్పటికీ.. తర్వాత పుంజుకొని పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. నీరూ ధండా తనకు లభించిన తొలి 5 అవకాశాల్లో 3 విఫలమైనప్పటికీ, ఆమె మెరుపు వేగంతో కోలుకుంది. 36 ఏళ్ల సీనియర్ ఆటగాడు కైనన్ సేనాయ్ తన అపారమైన అనుభవాన్ని ప్రదర్శించి, వరుసగా లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించాడు.
ఆసియా రికార్డ్ బ్రేక్..
ఈ ఇద్దరూ 40 పాయింట్స్‌కు 34 సాధించి.. నయా ఆసియా రికార్డ్‌తో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. దోహాలో గతంలో ఖతార్ నెలకొల్పిన ఆసియా రికార్డ్‌ను ఈ భారత ద్వయం బద్దలు కొట్టింది. ఖతార్ 32 పాయింట్లతో రజత పతకాన్ని, చైనా కాంస్య పతకాన్ని గెలుచుకున్నాయి. ఇరాన్ 4వ స్థానంలో నిలిచింది.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో తొలి సెంటర్‌లోని డ్రాప్ మెషీన్ ఆకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయింది. దాంతో మ్యాచ్‌ను సుమారు 5 నిమిషాల పాటు తాత్కలికంగా నిలిపివేశారు. ఆ తర్వాత దాన్ని తిరిగి ప్రారంభించి ఉత్సాహంగా ఆడారు.
నీరు దండా తీన్మార్..
ఆసియా గేమ్స్‌లో నీరు దండాకు ఇది మూడో పతకం. ఆమె ఇప్పటికే మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో కొత్త ఆసియా రికార్డ్‌తో స్వర్ణ పతకాన్ని, మహిళల ట్రాప్ టీమ్ విభాగంలో రజత పతకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు, ఆమె మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో కూడా స్వర్ణ పతకాన్ని గెలుచుకొని, ఒకే ఆసియా సిరీస్‌లో 2 స్వర్ణాలు, రజతంతో మొత్తం 3 పతకాలతో భారత షూటింగ్ చరిత్రలోనే ఒక కొత్త శతకాన్ని సృష్టించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


