Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: భారత్‌ ధగధగ.. గంట వ్యవధిలోనే రెండు స్వర్ణాలు!

ఆసియా గేమ్స్ 2026లో భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. గంటల వ్యవధిలోనే రెండు పసిడి పతకాలతో భారత్ ఆర్చర్లు మెరిసారు. 11వ రోజు అయిన బుధవారం మహిళల కాంపౌండ్ ఆర్చర్ టీమ్ స్వర్ణంతో శుభారంభం చేయగా.. మిక్స్‌డ్ టీమ్‌ కూడా తగ్గేదేలేదంటూ పసిడిని ముద్దాడింది. చికితా, సాహిల్ జాదవ్‌లతో కూడిన కాంపౌండ్ మిక్స్‌డ్ ఆర్చరీ డబుల్స్ టీమ్ ఫైనల్లో సౌత్ కొరియాను మట్టికరిపించి భారత్‌కు 8వ స్వర్ణాన్ని అందించింది.

Asian Games 2026 Chikitha and Sahil Win Gold in Compound Mixed Team Archery

సెమీఫైనల్లో 156-155 తేడాతో థాయిలాండ్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లో సౌత్ కొరియాతో స్కోర్లు సమమయ్యాయి. మ్యాచ్ ఆరంభం నుంచి భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. తొలి రౌండ్‌లో 40కి 40 పాయింట్స్ సాధించిన భారత ఆర్చర్లు.. రెండో రౌండ్ ముగిసే సరికి 80-78తో స్వల్ప ఆధిక్యాన్ని సాధించారు.

మూడో రౌండ్‌లో ఇరు జట్లు సమంగా తలపడటంతో భారత్ లీడ్ 118-117కి తగ్గింది. నాలుగో రౌండ్‌లో సౌత్ కొరియా 40కి 40 పాయింట్స్ సాధించడంతో స్కోర్లు 157-157తో సమమయ్యాయి. దాంతో షూటాఫ్ ద్వారా ఫలితాన్ని తేల్చారు.

Asian Games 2026: సత్తా చాటిన తెలుగు అమ్మాయిలు.. భారత్‌కు మరో స్వర్ణం!

Asian Games 2026: సత్తా చాటిన తెలుగు అమ్మాయిలు.. భారత్‌కు మరో స్వర్ణం!

షూటాఫ్ ద్వారా ఫలితం..

షూటాఫ్ రౌండ్ కూడా ఉత్కంఠగా సాగింది. ఈ మెడల్ డిసైడర్ రౌండ్‌లో ముందుగా చికిత 10కి 10 పాయింట్స్ సాధించింది. సౌత్ కొరియా ఆర్చర్ కూడా 10 పాయింట్లు సాధించడంతో ఉత్కంఠ నెలకొంది. సాహిల్ జాదవ్ ఎలాంటి తప్పిదం చేయకుండా 10కి 10 పాయింట్లు సాధించాడు.

సౌత్ కొరియా ప్లేయర్ 9 పాయింట్లే సాధించడంతో 20-19 తేడాతో భారత్‌కు స్వర్ణం సొంతమైంది. ఈ విజయంతో భారత మిక్స్‌డ్ కాంపౌడ్ ద్వయానికి 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ బెర్త్ దక్కింది. ఈ ఒలింపిక్స్‌లోనే కాంపౌండ్ ఆర్చరీని తొలిసారిగా ప్రవేశపెట్టారు.

తెలంగాణ అమ్మాయి డబుల్ ధమాకా..

తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన 21 ఏళ్ల చికితా.. ఈ ఆసియా గేమ్స్‌లో వరుసగా రెండు బంగారు పతకాలు సాధించింది. మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ,ప్రీతికతో కలిసి చికిత గోల్డ్ మెడల్ సాధించింది. బుధవారమే జరిగిన ఫైనల్లో ఈ భారత త్రయం 238-234 తేడాతో చైనాను ఓడించి పసిడిని ముద్దాడింది. చికితా-సాహిల్ ద్వయం సాధించిన ఈ గోల్డ్.. భారత్‌కు 8వది కాగా.. మొత్తం 54 పతకాలతో మెడల్స్ టేబుల్‌లో 9వ స్థానంలో కొనసాగుతోంది.

Asian Games 2026: భారత్ X శ్రీలంక సెమీఫైనల్ రద్దయితే.. ఫైనల్ చేరేది ఎవరంటే?

Also Read

Asian Games 2026: భారత్ X శ్రీలంక సెమీఫైనల్ రద్దయితే.. ఫైనల్ చేరేది ఎవరంటే?
Story first published: Wednesday, September 30, 2026, 10:27 [IST]
Other articles published on Sep 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+