Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: సత్తా చాటిన తెలుగు అమ్మాయిలు.. భారత్‌కు మరో స్వర్ణం!

ఆసియా గేమ్స్ 2026లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ పసిడి సాధించింది. బుధవారం జరిగిన ఫైనల్లో జ్యోతి సురేఖ, చికితా రావు, ప్రీతిక త్రయంతో కూడిన భారత టీమ్ 238-234 తేడాతో చైనాను ఓడించి పసిడిని ముద్దాడింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ ఎడిషన్ బరిలోకి దిగిన భారత త్రయం.. గోల్డ్ మెడల్‌ను నిలబెట్టుకుంది. ఈ క్రమంలో 2014 ఆసియా గేమ్స్‌లో సౌత్ కొరియా నమోదు చేసిన స్కోర్‌ను సమం చేసింది.

ఆర్చరీలో చరిత్ర సృష్టించిన తెలుగు తేజం.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు!

ఆర్చరీలో చరిత్ర సృష్టించిన తెలుగు తేజం.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు!

తొలి రౌండ్ నుంచే భారత ఆర్చర్లు పూర్తి ఆధిక్యం ప్రదర్శించారు. తొలి రౌండ్‌లో 60-58 ఆధిక్యాన్ని సాధించిన భారత ఆర్చర్ టీమ్.. రెండో సెట్‌లో కూడా అదే జోరును కొనసాగించి లీడ్‌ను 119-116కు పెంచుకుంది.

Asian Games 2026 India Beat China to Defend Gold in Women s Compound Team Archery

మూడో సెట్‌లో చైనా క్రీడాకారుల నుంచి ఒత్తిడి ఎదురైనప్పటికీ.. ఏ మాత్రం కంగారుపడని భారత క్రీడాకారులు మరో 10 పాయింట్లు సాధించి, తమ ఆధిక్యాన్ని 178-175 పెంచుకుంది. స్వర్ణాన్ని డిసైడ్ చేసే నాలుగో రౌండ్‌లో.. భారత త్రయం గురితప్పకుండా లక్ష్యాలను ఛేదించారు. దాంతో భారత్ 238-234 తేడాతో చైనాను అధిగమించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

ఒకే రోజు రెండు పసిడి పతకాలు.. ధీరజ్ 'గోల్డెన్ డబుల్' ధమాకా!

Also Read

ఒకే రోజు రెండు పసిడి పతకాలు.. ధీరజ్ 'గోల్డెన్ డబుల్' ధమాకా!

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన జ్యోతి.. భారత్‌కు అత్యధిక పతకాలు అందించిన కాంపౌండ్ ఆర్చర్. 30 ఏళ్ల జ్యోతి ఇప్పటికే 5 మెడల్స్ గెలవగా.. అందులో మూడు బంగారు పతకాలు ఉన్నాయి. తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన 21 ఏళ్ల చికితా.. జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ కేటగిరిలో భారత తొలి వ్యక్తిగత గోల్డ్ మెడల్ అందించింది.

తమిళనాడులో పుట్టి మహారాష్ట్రలోని పుణేలో పెరిగిన 17 ఏళ్ల ప్రతీకా.. 2024 ఏషియన్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డ్.. వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్స్‌లో సిల్వర్, వరల్డ్ కప్ స్టేజ్ 4లో కాంస్య పతకం గెలిచింది. ఆర్చర్ టీమ్ సాధించిన ఈ గోల్డ్ మెడల్.. భారత్‌కు ఏడోది కాగా.. మొత్తం 54 పతకాలతో మెడల్స్ టేబుల్‌లో 9వ స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Wednesday, September 30, 2026, 9:41 [IST]
Other articles published on Sep 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+