Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: విలువిద్యలో భారత్‌కు నాలుగో స్వర్ణం.. 48 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!

ఆసియా గేమ్స్‌లో భారత ఆర్చర్లు దుమ్మురేపుతున్నారు. ఇప్పటికే ఈ విభాగంలో మూడు స్వర్ణ పతకాలు రాగా.. తాజాగా రికర్వ్ ఆర్చరీ కాంపౌండ్‌ విభాగంలో భారత అమ్మాయిలు స్వర్ణం సాధించారు. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత మహిళల రికర్వ్ ఆర్చరీ టీమ్ 5-3 తేడాతో సౌత్ కొరియాను ఓడించింది. 1978 నుంచి ఆసియా గేమ్స్‌లో సౌత్ కొరియా కొనసాగిస్తున్న 48 ఏళ్ల ఆధిపత్యానికి భారత ఆర్చర్లు తెరదించి సరికొత్త చరిత్ర సృష్టించారు.

భారత్ X పాక్ ఫైనల్ మ్యాచ్.. షేక్ హ్యాండ్ ఉంటుందా..?

భారత్ X పాక్ ఫైనల్ మ్యాచ్.. షేక్ హ్యాండ్ ఉంటుందా..?

నగోయాలోని ఒకాజాకి స్టేడియంలో జరిగిన మహిళల రికర్వ్ టీమ్ ఫైనల్లో భారత ఆర్చర్లు అంకితా భకత్, క్తీర్తి శర్మ, కుంకుమ్ మొహద్ త్రయం అద్భుత ప్రదర్శన చేసింది. పదిసార్లు ఒలింపిక్ ఛాంపియన్‌గా నిలిచిన సౌతా కొరియాను ఓడించింది. తొలి సెట్‌లో ఇరు జట్లు చెరో 54 పాయింట్లతో 1-1తో సమంగా నిలిచాయి. రెండో సెట్‌లో కొరియన్లు 56 పాయింట్స్ సాధించగా.. ఆఖరి సెకన్లలో కుంకుమ్ మొహద్ రెండు సార్లు 10 పాయింట్లు సాధించి స్కోర్‌ను 56-56తో సమం చేసింది.

Asian Games 2026 India Win Historic Gold Medal in Women s Team Recurve Archery

మూడో సెట్‌లో భారత ఆర్చర్లు 55-51 తేడాతో గెలిచి ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. స్వర్ణాన్ని ఖరారు చేసే నాలుగో సెట్‌లో సౌత్ కొరియా 54 పాయింట్లు సాధించగా.. భారత్ తరఫున కీర్తి, అంకిత చెరో 9 పాయింట్స్ సాధించడంతో చివరి బాణం వేసిన కుంకుమ్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. కుంకుమ్ 10 పాయింట్ల లోపే అత్యంత కచ్చితత్వంతో చివరి బాణాన్ని వేసి సెట్‌ను 54-54తో సమం చేసింది. దాంతో భారత జట్టు 5-3 స్కోర్‌తో విజయం సాధించి పసిడిని ముద్దాడింది.

గోల్డ్ మెడల్ ప్రపంచకప్ కంటే గొప్పది.. తిండికి డోకా లేదు: అక్షర్ పటేల్

Also Read

గోల్డ్ మెడల్ ప్రపంచకప్ కంటే గొప్పది.. తిండికి డోకా లేదు: అక్షర్ పటేల్

అంతకుముందు సెమీఫైనల్లో భారత అమ్మాయిలు 5-1తో చైనాను ఓడించి తొలిసారి ఆసియా గేమ్స్ ఫైనల్‌కు అర్హత సాధించారు. హౌంగ్జౌలో జరిగిన గత ఆసియా గేమ్స్‌లో రికర్వ్ ఆర్చరీ మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు కాంస్యం దక్కింది. తాజా స్వర్ణంతో భారత్ పతకాల పట్టికలో ఏడో స్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 11 స్వర్ణాలతో పాటు 23 రజతాలు, 33 కాంస్యాలతో మొత్తం 57 పతకాలు ఉన్నాయి.

Story first published: Friday, October 2, 2026, 8:45 [IST]
Other articles published on Oct 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+