భారత్ X పాక్ ఫైనల్ మ్యాచ్.. షేక్ హ్యాండ్ ఉంటుందా..?
భారత్, పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్‌కు మరోసారి రంగం సిద్దమైంది. ఈ సారి ఆసియా గేమ్స్ 2026 ఫైనల్ వేదికైంది. ఇరు జట్లు సెమీస్‌లో విజయాలు సాధించి స్వర్ణ పోరుకు అర్హత సాధించాయి. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అనగానే.. దాయాదీ దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు గుర్తుకొస్తాయి.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత్ ఆసక్తి చూపడం లేదు. బీసీసీఐ ఆదేశాలతో ఆసియా కప్ 2026తో పాటు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లోనూ పాకిస్థాన్ ఆటగాళ్లతో భారత్ కరచాలనం చేయలేదు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మెన్ మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ కూడా అందుకోలేదు. మహిళల టీమ్ కూడా పురుషుల జట్టును అనుసరించింది.
రూల్స్‌లో లేదు.. కానీ
ఆసియా గేమ్స్ 2026 ఫైనల్లో భారత్, పాక్ ఆటగాళ్ల కరచాలనం ఉంటుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే ఆసియా క్రీడల్లో ఇరు దేశాల ఆటగాళ్లు కరచాలనం చేసుకోవాలనే కచ్చితమైన నిబంధన అయితే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ)రూల్స్ అయితే లేదు. కానీ క్రీడాస్ఫూర్తి అనేది కీలకం.

2016 ఒలింపిక్స్‌లో ఈజిప్ట్ జుడోకా అథ్లెట్.. ఇజ్రాయిల్ అథ్లెట్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఐఓసీ ఎలాంటి జరిమానా విధించనప్పటికీ.. క్రీడాస్ఫూర్తికి విరద్దుమని మందలించింది. ఉక్రెయిన్ అథ్లెట్లు కూడా రష్యా, బెలారస్ అథ్లెట్లు కూడా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం లేదు. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్దం జరగుతున్న సంగతి తెలిసిందే.
పోడియం ఎక్కాల్సిందే..
పాకిస్థాన్ విషయంలోనూ భారత్ ఇలానే వ్యవహరించే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచ్‌కు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియాతో పాటు ఐసీసీ ఛైర్మన్ జైషా హాజరవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ సందర్భంగా..మోహ్సిన్ నఖ్వీకి దేవజిత్ సైకియా షేక్ హ్యాండ్ ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. చివరకు సైకియా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
క్రికెట్ మినహా.. మిగతా క్రీడల్లో మాత్రం భారత్, పాకిస్థాన్ అథ్లెట్లు కరచాలనం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత పోడియం మాత్రం ఇరు దేశాల క్రికెటర్లు పంచుకోవాల్సిందే. మహిళా క్రికెట్ జట్టు కూడా పాకిస్థాన్ టీమ్‌తో పోడియం పంచుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


