Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గోల్డ్ మెడల్ ప్రపంచకప్ కంటే గొప్పది.. తిండికి డోకా లేదు: అక్షర్ పటేల్

ఆసియా గేమ్స్ 2026లో బంగారు పతకం గెలవడం చాలా ప్రత్యేకమైన అనుభవమని, ప్రపంచకప్ కంటే గొప్ప విజయమని టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అన్నాడు. ఆసియా గేమ్స్ 2026లో భారత్ పురుషుల క్రికెట్ టీమ్ ఫైనల్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.

గురువారం శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 124 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. శనివారం జరిగే ఫైనల్లో పాకిస్థాన్‌తో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది.

150 చేస్తే గెలవచ్చని అనుకున్నాం..

సెమీఫైనల్ విజయానంతరం బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన అక్షర్ పటేల్..తన అనుభవాలను పంచుకున్నాడు. గేమ్ విలేజ్‌లో ఉండటం ప్రత్యేక అనుభూతినిస్తోందని చెప్పాడు. 'ఏ జట్టు అయినా గెలవాలంటే గట్టిగా ప్రయత్నించాలి. మేం చేయాల్సింది మేం చేశాం. అయితే ఈ మ్యాచ్ ఆడేందుకు చాలా రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. వర్షం పడటం వల్ల మ్యాచ్‌లు జరగలేదు. సుదీర్ఘ విరామం తర్వాత మ్యాచ్ జరిగినప్పటికీ జట్టులోని ప్రతీ ఒక్కరూ అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు.

Axar Patel Says Food Is No Issue as India Target Gold Ahead of IND vs PAK Asian Games 2026 Final

పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లు కూడా ఇదే పిచ్‌పై జరిగాయి. ఆ మ్యాచ్‌లు చూశాక ఈ వికెట్‌పై 140-150 పరుగులు చేస్తే గెలిచే అవకాశం ఉంటుందని అంచనా వేశాం. కానీ మేం అదనంగా(169) 10-15 పరుగులు ఎక్కువే చేశాం. మ్యాచ్ ఆరంభంలో బంతికి డ్రిఫ్ట్, టర్న్, బౌన్స్ బాగా లభించాయి.

Asian Games 2026: భారత్ X పాక్ ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. విజేతగా నిలిచేది ఎవరంటే?

Asian Games 2026: భారత్ X పాక్ ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. విజేతగా నిలిచేది ఎవరంటే?

పాకిస్థాన్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్ ఏ వికెట్‌పై ఆడిస్తారనే దానిపై ప్రస్తుతం మాకూ సమాచారం లేదు. దీని గురించి మాట్లాడాం కానీ ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. అయితే ఇక్కడి మైదానంలో మూడు వికెట్లు ఉన్నాయి. మూడూ దాదాపు ఒకేలా పగుళ్లతో కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ వికెట్‌పై ఆడినా పిచ్ ప్రవర్తనలో ఎలాంటి తేడా ఉండే అవకాశం లేదు.

తిండికి డోకా లేదు

ఇక్కడి భారతీయ రెస్టారెంట్ల నుంచి పార్సిల్ తెప్పించుకొని తింటున్నాం. తిండి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ మూడు, నాలుగు ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయి. వాళ్ల ఫుడ్ బాగా వండుతున్నారు. జపాన్‌లో క్రికెట్ ఎక్కువగా ఆడరన్న విషయం తెలిసిందే. కానీ వాళ్ళు చేస్తున్న కృషి మాత్రం అద్భుతం. మైదానంతో పాటు వాతావరణం విషయంలో వాళ్ళ పరిమితుల మేరకు మంచి ఏర్పాట్లు చేశారు. రాబోయే రోజుల్లో క్రికెట్ సౌకర్యాలను మరింత పెంచి, ఇంకా మంచి పరిస్థితులు కల్పిస్తారని ఆశిస్తున్నా.

ఆసియా గేమ్స్ 2026లో భారత్‌ను ఓడిస్తాం.. అదే మా లక్ష్యం: పాకిస్థాన్ హెడ్ కోచ్

Also Read

ఆసియా గేమ్స్ 2026లో భారత్‌ను ఓడిస్తాం.. అదే మా లక్ష్యం: పాకిస్థాన్ హెడ్ కోచ్

ప్రపంచకప్ కంటే గోల్డ్ మెడల్ గొప్పది..

నేను గేమ్స్ విలేజ్‌లో ఉండటం ఇదే తొలిసారి. ఈ అనుభవం చాలా బాగుంది. గతంలో మేం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లేదా ఇతర దేశాలకు వెళ్లినప్పటి అనుభవాలకు ఇక్కడికి చాలా తేడా ఉంది. కానీ ఏషియన్ గేమ్స్‌లో ఇతర క్రీడాకారులతో కలిసి ఉండటం ఒక కొత్త అనుభూతినిస్తోంది. ఇక్కడున్న ప్రతీ ఒక్కరికీ ఐడీ కార్డులు ఇచ్చారు.

ఆ ఐడీ కార్డు వేసుకుని బయట నడుస్తున్నప్పుడు జనాలు మమ్మల్ని చూసే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. అథ్లెట్లు అని జనాలు గుర్తించి ప్రత్యేకంగా చూస్తుంటారు. ఇది నాకు చాలా సంతోషాన్నిస్తోంది. గోల్డ్ మెడల్ గెలవడం అనేది ప్రత్యేకమైన అనుభవం. మేం గతంలో ప్రపంచకప్, ఇతర పెద్ద టోర్నీలు గెలిచాం. అక్కడ బీసీసీఐ తరఫున దేశం కోసం ఆడుతాం. కానీ ఆసియా గేమ్స్‌లో పరిస్థితులు వేరు.

ఇక్కడ నేరుగా దేశం తరఫున ఆడి స్వర్ణం సాధించే అవకాశం లభిస్తుంది. నా దృష్టిలో ప్రపంచకప్ కంటే ఇది చాలా ముఖ్యమైనది. మా ఆట తీరు చూస్తుంటే స్వర్ణం గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ స్వర్ణం గెలిస్తే.. అది నాకు చాలా గర్వకారణమైన క్షణం అవుతుంది.'అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, October 1, 2026, 17:16 [IST]
Other articles published on Oct 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+