Asian Games 2026: భారత్‌కు తొలి పతకం.. షూటింగ్‌తో షురూ!
ఆసియా గేమ్స్ 2026లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. షూటింగ్‌లో భారత మహిళల టీమ్ రజత పతకం సాధించింది. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల టీమ్ ఈవెంట్‌లో భారత షూటింగ్ టీమ్ 1898 స్కోర్‌తో రెండో స్థానంలో నిలిచింది. 1904.2 పాయింట్లతో చైనా అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని అందుకుంది.
1897.1 పాయింట్లతో జపాన్ మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ గెలిచింది. ఎలవెనిల్ వలరివన్(633.5), విదర్స కొచలుంకల్ వినోద్(630.4), సోనమ్ ఉత్తమ్ మస్కర్(634.1)లతో కూడిన భారత మహిళల షూటింగ్ టీమ్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. ఈ పతకంతో మెడల్స్ పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.

భారత షూటర్స్ ఎవరంటే..?
ఎలవెనిల్ వలరివన్
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటర్స్‌లో ఎలవెనిల్ వలరివన్ అపారమైన అనుభవం ఉంది. తమిళనాడుకు చెందిన ఈమె.. 2014లో తన కెరీర్‌ను ప్రారంభించింది. గత రెండు ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. మాజీ జూనియర్ వరల్డ్ ఛాంపియన్ అయిన ఎలవెనిల్ వలరివన్.. 2019 ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ ఫైనల్లో గోల్డ్ గెలవడంతో పాటు ప్రపంచకప్, ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో అనేక పతకాలు సాధించింది. 2022లో ఆమెకు భారత క్రీడా పురస్కారం అర్జున అవార్డ్ వరించింది.
విదర్స కొచలుంకల్ వినోద్
కేరళకు చెందిన విదర్స కొచలుంకల్ వినోద్.. పేదరికాన్ని జయించి ప్రొఫెషనల్ షూటర్‌గా ఎదిగింది. 2021లో తన తొలి రైఫిల్ కొనేందుకు విదర్స కుటుంబం బ్యాంక్ లోన్ తీసుకుంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూనే.. విదర్సా షూటింగ్‌లో సత్తా చాటింది. 2025 ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో విదర్స తొలి అంతర్జాతీయ మెడల్ గెలిచింది. ఈ ప్రదర్శనతో ఆసియా గేమ్స్ 2026 అర్హత సాధించింది. ఈ టోర్నీలో ఆమె 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌తో పాటు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్స్‌లో పాల్గొంటుంది.
సోనమ్ ఉత్తమ్ మాస్కర్..
మహారాష్ట్రలోని కోల్హాపూర్‌కు చెందిన సోనమ్ ఉత్తమ్.. కాలేజీ డేస్ నుంచే షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో రజత పతకం సాధించింది. 2026 హాంగ్జౌ ప్రపంచకప్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


