Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: నఖ్వీ చేతుల మీదుగా భారత్ మెడల్స్ తీసుకోవాల్సిందేనా..?

ఆసియా గేమ్స్ 2026 టోర్నీలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్, ఏసీసీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా భారత అథ్లెట్లు పతకాలు స్వీకరించే పరిస్థితి ఎదురవనుంది. అదే జరిగితే భారత్ అథ్లెట్లు ఏం చేస్తారనేది? మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఆసియా కప్‌ టోర్నీల్లో విజేతగా నిలిచిన భారత్ పురుషుల, మహిళల జట్లు నఖ్వీ చేతుల మీదుగా టైటిళ్లు స్వీకరించేందుకు నిరాకరించాయి. టైటిళ్లు లేకుండా విజయాలను సెలెబ్రేట్ చేసుకున్నాయి. ఇప్పటికీ ఆ టైటిళ్లు భారత్‌కు చేరలేదు.

Asian Games 2026: నక్కతోక తొక్కిన బంగ్లాదేశ్.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే సెమీఫైనల్‌కు..!

Asian Games 2026: నక్కతోక తొక్కిన బంగ్లాదేశ్.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే సెమీఫైనల్‌కు..!

జపాన్ వేదికగా శనివారం ప్రారంభమైన ఆసియా గేమ్స్‌లో కూడా అలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. పీసీబీ, ఏసీసీ ఛైర్మన్ అయిన మోహ్సిన్ నఖ్వీ.. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియాలో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా రూల్స్ ప్రకారం.. ఆసియా ఒలింపిక్ మండలి అధ్యక్షుడు విజేతలకు మెడల్స్ అందిస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ పతకాలు అందించే బాధ్యతను ఓసీఏలోని ఇతర సభ్యులకు కూడా అప్పగించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది.

Asian Games 2026 Will Team India Accept Medals From Mohsin Naqvi BCCI Breaks Silence

ఆసియా ఒలింపిక్ మండలిలో సభ్యుడిగా కొనసాగుతున్న నఖ్వీకి మెడల్స్ అందించే బాధ్యత అప్పగిస్తే.. భారత్ ఏం చేస్తుందనేది చర్చనీయాంశమైంది. అయితే నఖ్వీ చేతుల మీదుగా మెడల్స్ తీసుకోవాల్సిందేనని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) వర్గాలు తెలిపాయి. అందుకు తిరస్కరిస్తే గేమ్స్‌ను అగౌరవపరిచిన కిందకే వస్తుందని పేర్కొన్నాయి. మెడల్స్ ప్రదానోత్సవంలో ఎలాంటి రాజకీయ మతపరమైన ప్రచారానికి అనమతి ఉండదు. మెడల్స్‌ను స్వీకరించకపోతే ఒలింపిక్ అసోసియేషన్ తీవ్ర తప్పిదంగా పరిగణిస్తోంది.

Asian Games 2026: ప్రత్యేకమైన జెర్సీలో భారత మహిళా క్రికెటర్లు.. ఎందుకంటే?

Also Read

Asian Games 2026: ప్రత్యేకమైన జెర్సీలో భారత మహిళా క్రికెటర్లు.. ఎందుకంటే?

ఈ అంశంపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించారు. 'ప్రస్తుతానికి మా దృష్టంతా మ్యాచ్‌లు గెలవడంపైనే ఉంది. పతకాలు గెలిచిన తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి దానిపై నిర్ణయం తీసుకుంటాం. అంతేగానీ ఇంకా జరగని విషయం గురించి ఇప్పుడే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 'అని ఆయన స్పష్టం చేశారు. ఆసియా కప్ టైటిల్స్ కూడా భారత్‌కు వస్తాయని సైకియా తెలిపారు.

Story first published: Saturday, September 19, 2026, 13:47 [IST]
Other articles published on Sep 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+