Asian Games 2026: టీమిండియాకు కిట్ కష్టాలు.. ఇంకా అందని జెర్సీలు!
ఆసియా గేమ్స్ 2026 టోర్నీకి సిద్దమైన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత టీ20 జట్టు.. కిట్ కష్టాలను ఎదుర్కొంటోంది. ఆసియా గేమ్స్ కోసం భారత జట్టు ఆదివారం జపాన్‌కు బయర్దేరాల్సి ఉండగా.. టీమ్‌లోని చాలా మంది ప్లేయర్లకు ఇంకా అధికారిక కిట్స్ అందలేదు. ఈ విషయంలో బీసీసీఐ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ), కిట్ స్పాన్సర్ జేఎస్‌డబ్ల్యూ ఇన్‌స్పైర్ మధ్య పదే పదే సంప్రదింపులు జరుగుతున్నట్లు పీటీఐ పేర్కొంది.
పీటీఐ కథనం ప్రకారం.. కిట్స్‌లో జెర్సీల సైజుల సమస్యలు పరిష్కారమయ్యాయి. అయితే కొందరు ఆటగాళ్లు ఇంకా తమ కిట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఆదివారం శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు న్యూఢిల్లీలో జపాన్ ఫ్లైట్ ఎక్కనుంది.
వెర్వేరు జెర్సీలతో..
ఈ జపాన్ పర్యటనలో భారత్ రెండు వేర్వేరు జెర్సీలను ధరించనుంది. జపాన్‌తో జరిగే ఏకైక చారిత్రాత్మక టీ20 మ్యాచ్‌లో రెగ్యులర్ జెర్సీలతో ఆడనున్న భారత్.. ఆసియా గేమ్స్ మాత్రం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ జెర్సీలతో బరిలోకి దిగనుంది. ఇప్పటికే భారత మహిళల జట్టు ఎలాంటి స్పాన్సర్ల పేరు లేని బ్లూ కలర్ జెర్సీలో కనిపించింది. పురుషుల టీమ్ కూడా ఇదే తరహా జెర్సీలతో ఆడనుంది.

జెర్సీలో మార్పు ఎందుకంటే..?
ఆసియా గేమ్స్ 2026 టోర్నీలో రెగ్యులర్ బీసీసీఐ జెర్సీలతో ఆడటానికి వీలు లేదు. ఈ టోర్నీలో అథ్లెట్లంతా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పతాకం కింద బరిలోకి దిగుతారు. వ్యక్తిగత క్రీడా సంఘాల గుర్తింపు కంటే దేశానికి ప్రాతినిథ్యం వహించే జాతీయ ఒలింపిక్ సంఘానికే ఇక్కడ అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అంతర్జాతీయ మల్టీ-స్పోర్ట్స్ ఈవెంట్లలో క్రీడాస్ఫూర్తి, సమానత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.
అథ్లెటిక్స్, కుస్తీ, బ్యాడ్మింటన్, హాకీ, క్రికెట్.. ఏ క్రీడ అయినా సరే.. దేశం తరఫున బరిలోకి దిగే ప్రతి క్రీడాకారుడికి ఒకే రకమైన అధికారిక జెర్సీ కోడ్ వర్తిస్తుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియే(ఐఓఏ) ప్రత్యేకంగా రూపొందించిన డిజైన్.. రంగులు ఉన్న అధికారిక నేషనల్ కిట్‌నే ప్రతి ఒక్కరూ ధరించాల్సి ఉంటుంది. భారత క్రీడాకారులంతా ఒకే రకమైన జెర్సీలు ధరిస్తారు.
బీసీసీఐ ప్రత్యేక వసతి..
శ్రేయస్ అయ్యర్ టీమ్ బసకు సంబంధించి బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టోర్నీ నిర్వాహకులు కేటాయించిన గదులపై ఆందోళనలు వ్యక్తమవడంతో.. బీసీసీఐ నగోయాలోని పురుషుల క్రికెట్ జట్టుకు స్పెషల్ అరెంజ్ మెంట్స్ చేసింది. భారత పురుషుల క్రికెట్ టీమ్‌కు నిర్వాహకులు కేటాయించిన గదుల్లో ఆటగాళ్ల కిట్ బ్యాగులు కూడా పెట్టుకోవడానికి తగినంత స్థలం లేకపోవడంతో.. బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. మరోవైపు మహిళా క్రికెట్ జట్టు మాత్రం ఐఓఏ ఏర్పాటు చేసిన వసతిలోనే కొనసాగుతోంది.
పురుషుల క్రికెట్ టోర్నీ సెప్టెంబర్ 24న గ్రూప్ దశతో మొదలవుతుంది. గ్రూప్ ఎలో అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్ ఉండగా.. గ్రూప్ బిలో హాంకాంగ్, మలేషియా, ఒమన్ ఉన్నాయి. మెరుగైన ఐసీసీ ర్యాంకింగ్స్ కలిగిన భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడనున్నాయి. భారత్ సెప్టెంబర్ 28న గ్రూప్ 'ఎ' రన్నరప్‌తో తలపడుతుంది. అక్టోబర్ 1న సెమీ-ఫైనల్స్, ఆ తర్వాత అక్టోబర్ 3న బ్రాంజ్ మెడల్ పోరుతో పాటు ఫైనల్ జరుగుతాయి. 2023 ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచి భారత్ పురుషుల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


