Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: అదిరిందయ్యా చంద్రం.. ఒకే రోజు 4 బంగారు పతకాలు!

ఆసియా గేమ్స్‌లో శుక్రవారం భారత్‌కు బాగా కలిసొచ్చింది. బాక్సర్లు, రెజ్లర్లు అదరగొట్టడంతో ఈ ఒక్క రోజే నాలుగు బంగారు పతకాలు దక్కాయి. ఆర్చరీలోనూ ఓ బంగారు పతకం వచ్చింది. దాంతో మెడల్స్ పట్టికలో భారత్ ఐదో స్థానానికి దూసుకెళ్లింది.

బాక్సర్ లవ్లీనా శుభారంభం చేయగా.. పర్వీన్, సుజీత్, అంకుష్ సత్తా చాటారు. కేవలం అరగంట వ్యవధిలోనే భారత్ మూడు స్వర్ణాలు సాధించింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 75 పతకాలు ఉండగా.. వీటిలో 15 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలు ఉన్నాయి.

Asian Games 2026: పంచ్ అదిరింది.. భారత్‌కు మరో పసిడి దక్కింది!

Asian Games 2026: పంచ్ అదిరింది.. భారత్‌కు మరో పసిడి దక్కింది!

బాక్సర్ అంకుష్ పంఘల్‌‌కు స్వర్ణం..

పురుషుల 80 కేజీల బాక్సింగ్ ఫైనల్లో బాక్సర్ అంకుష్ పంఘల్ స్వర్ణ పతకం సాధించాడు. ఫైనల్లో 4-0 తేడాతో సౌత్ కొరియా‌కు చెందిన కిమ్ మిన్‌సియోంగ్‌ను ఎదుర్కొన్నాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అంకుష్.. కచ్చితమైన పంచ్‌లు విసిరి ఐదుగురు జడ్జీల మద్దతు పొందాడు.

Asian Games 2026 India Win 4 Gold Medals as Sujeet Kalkal Ankush Panghal Parveen Hooda and Lovlina Shine

తొలి రౌండ్‌ను 4-1తో గెలుచుకున్న అంకుష్.. రెండో రౌండ్‌ను 5-0తో కైవసం చేసుకున్నాడు. మూడో రౌండ్‌లో 4-0తో ఘన విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఆసియా గేమ్స్‌లో అంకుష్ ఒక్క రౌండ్‌లో కూడా ఓడిపోలేదు.

రెజ్లింగ్‌లో సూపర్ పట్టు..

భారత రెజ్లర్ సుజీత్ సూపర్ పట్టుతో గోల్డ్ మెడల్ సాధించాడు. పురుషుల 65 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ ఫైనల్లో ఒలింపిక్ ఛాంపియన్, తజకిస్థాన్‌కు చెందిన కుదీవ్‌ పైచేయి సాధించాడు. ఆ తర్వాత సుజీత్ పుంజుకొని తజకిస్థాన్ రెజ్లర్‌ను దెబ్బకొట్టాడు. చివరికి 10-9 తేడాతో గెలిచి స్వర్ణం సొంతం చేసుకున్నాడు.

Asian Games 2026: విలువిద్యలో భారత్‌కు నాలుగో స్వర్ణం.. 48 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!

Also Read

Asian Games 2026: విలువిద్యలో భారత్‌కు నాలుగో స్వర్ణం.. 48 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!

సెపక్‌తక్రాలో కాంస్యం..

భారత సెపక్ తక్రా జట్టుకు బ్రాంజ్ మెడల్ దక్కింది. సెమీస్‌లో భారత్‌పై జపాన్ విజయం సాధించింది. దాంతో ఆ జట్టు ఫైనల్ చేరగా.. సెమీస్‌కే పరిమితమైన భారత్ కాంస్యంతో సరిపెట్టుకుంది.

మహిళల బాక్సింగ్‌లో డబుల్ ధమాకా..

మహిళల బాక్సింగ్‌లో 75 కేజీల విభాగంలో లవ్లీనా, 65 కేజీల విభాగంలో పర్వీన్ హుడా స్వర్ణ పతకాలు సాధించారు. ఫైనల్లో లవ్లీనా 5-0 తేడాతో చైనా బాక్సర్‌ను బావో జియిపై విజయం సాధించింది. రెండు రౌండ్లలోనే చైనా బాక్సర్‌ను మట్టికరిపించింది. తద్వారా 12 ఏళ్ల తర్వాత బాక్సింగ్ విభాగంలో భారత్‌కు లవ్లీనా తొలి ఆసియా గేమ్స్ స్వర్ణాన్ని అందించింది. ఈ గెలుపుతో తన బర్త్‌డేను మరింత చిరస్మరణీయం చేసుకుంది.

శుక్రవారంతో 29వ ఏట అడుగుపెట్టిన ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా.. గతేడాది గెలుచుకున్న వెండి పతకాన్ని ఈసారి బంగారంగా మార్చుకుంది. మహిళల 65 కేజీల బాక్సింగ్ ఫైనల్లో భారత స్టార్ పర్వీన్ హుడా పసిడి పతకం గెలిచింది. ఫైనల్లో పర్వీన్ హుడా 3-2 తేడాతో చైనీస్ తైపీ బాక్సర్, పారిస్ ఒలింపిక్స్ విజేత చెన్ నీన్-చిన్‌ను ఓడించింది.

Story first published: Friday, October 2, 2026, 18:08 [IST]
Other articles published on Oct 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+