Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: పంచ్ అదిరింది.. భారత్‌కు మరో పసిడి దక్కింది!

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం వరించింది. మహిళల 65 కేజీల బాక్సింగ్ ఫైనల్లో భారత స్టార్ పర్వీన్ హుడా పసిడి పతకం గెలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో పర్వీన్ హుడా 3-2 తేడాతో చైనీస్ తైపీ బాక్సర్, పారిస్ ఒలింపిక్స్ విజేత చెన్ నీన్-చిన్‌ను ఓడించింది. భారత్‌కు ఇది 13వ స్వర్ణం కావడం గమనార్హం.

Asian Games 2026: బరిలో వైభవ్ సూర్యవంశీ.. పాకిస్థాన్‌తో ఫైనల్ ఆడే భారత తుది జట్టు ఇదే!</a><a class=" width="200" height="113">

Asian Games 2026: బరిలో వైభవ్ సూర్యవంశీ.. పాకిస్థాన్‌తో ఫైనల్ ఆడే భారత తుది జట్టు ఇదే!

హోరాహోరీగా సాగిన ఫైనల్లో తొలి రౌండ్‌ను 5-0తో గెలిచిన పర్వీన్ హుడా.. రెండో రౌండ్‌ను 0-5తో ఓడిపోయింది. ఇక మూడో రౌండ్‌ను 3-2తో కైవసం చేసుకుంది. హర్యానాలోని రోహత‌క్‌కు చెందిన పర్వీన్ హుడా.. గతంలో బాక్సింగ్ ప్రపంచకప్‌లో గోల్డ్ మెడల్, వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2022లో బ్రాంజ్ మెడల్, ఏషియన్ ఛాంపియన్‌షిప్ 2022లో గోల్డ్ మెడల్ సాధించింది.

Asian Games 2026 Parveen Hooda Wins Gold for India in Women s 65kg Boxing After Beating Paris Olympic Medallist Chen

ఆసియా గేమ్స్ చరిత్రలోనే స్వర్ణం సాధించిన మూడో బాక్సర్‌గా నిలిచింది. ఆమె కన్నా ముందు మేరీ కోమ్(51 కేజీలు) 2014 ఆసియా గేమ్స్‌లో బంగారు పతకం సాధించగా.. తాజా ఎడిషన్‌లో లవ్లీనా బొర్గోహైన్ మహిళల 75 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్లో లవ్లీనా 2-0 తేడాతో చైనా బాక్సర్‌ను బావో జియిపై విజయం సాధించింది. రెండు రౌండ్లలోనే చైనా బాక్సర్‌ను మట్టికరిపించింది.

తద్వారా 12 ఏళ్ల తర్వాత బాక్సింగ్ విభాగంలో భారత్‌కు లవ్లీనా తొలి ఆసియా గేమ్స్ స్వర్ణాన్ని అందించింది. ఈ గెలుపుతో తన బర్త్‌డేను మరింత చిరస్మరణీయం చేసుకుంది. శుక్రవారంతో 29వ ఏట అడుగుపెట్టిన ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా.. ఫైనల్లో చైనా బాక్సర్ బావో జియిని 5-0తో మట్టికరిపించింది. గతేడాది గెలుచుకున్న వెండి పతకాన్ని ఈసారి బంగారంగా మార్చుకుంది.

గోల్డ్ మెడలిస్ట్‌కు తప్పని నిరాశ: తలవంచిన తెలుగుతేజం!

Also Read

గోల్డ్ మెడలిస్ట్‌కు తప్పని నిరాశ: తలవంచిన తెలుగుతేజం!

ఈ చారిత్రాత్మక విజయంతో.. ఒలింపిక్స్ మెడల్‌తో పాటు ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన రెండో భారతీయ మహిళా బాక్సర్‌గా లవ్లీనా చరిత్ర సృష్టించింది. అంతకుముందు దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ మాత్రమే ఈ ఘనత సాధించింది. మేరీ కోమ్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2014 ఇంచెయాన్ ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలుచుకుంది.

Story first published: Friday, October 2, 2026, 15:12 [IST]
Other articles published on Oct 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+