Asian Games 2026: చరిత్ర సృష్టించిన నీరూ ధండా.. భారత్‌కు మరో స్వర్ణం!
భారత షూటర్ నీరూ ధండా చరిత్ర సృష్టించింది. ఆసియా గేమ్స్ 2026లో భారత్‌కు ఐదో స్వర్ణాన్ని అందించింది. ఈ సీజన్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ లోటు తీర్చింది. మంగళవారం జరిగిన మహిళల వ్యక్తిగత ట్రాప్ షూటింగ్ విభాగంలో నీరూ ధండా విజేతగా నిలిచి పసిడిని ముద్దాడింది. ఇప్పటికే మహిళల ట్రాప్ షూటింగ్ టీమ్ ఈవెంట్‌లో నీరూ రజత పతకాన్ని దక్కించుకుంది. ఈ టీమ్‌లో నీరూతో పాటు ఆషియా, అహ్లావత్, మనీషా కీర్ ఉన్నారు.
హర్యానాకు చెందిన నీరూ ధండా.. ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించింది. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ.. ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా లక్ష్యాలను ఛేదించింది. ఫైనల్ రౌండ్‌లో 28 పాయింట్స్ సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దాంతోచైనా షూటర్ లియు వాన్ యు పేరిట ఉన్న రికార్డ్‌ను నీరూ ధండా అధిగమించింది. గత ఆసియా గేమ్స్ ఫైనల్లో లియు వాన్ 24 పాయింట్స్ సాధించింది.

తాజా ఫైనల్లో చైనా షూటర్ సన్ యునాంగ్ గట్టి పోటీ ఇచ్చింది. 30 అవకాశాలకు నీరూ ధండా 28 పాయింట్స్ సాధించగా.. చైనా ప్లేయర్ 21 పాయింట్స్ సాధించింది. స్వర్ణాన్ని ఖరారు చేసే చివరి 5 షాట్లలో.. నీరూ ధండా ఐదుకి ఐదు లక్ష్యాలను ఛేదించి, స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.
దాంతో నీరూ ధండా ఒకే రోజు ఆమె స్వర్ణంతో పాటు రజత పతకాలను సాధించింది. నీరూ స్వర్ణంతో భారత్ పతకాల సంఖ్య 58కి చేరింది. ఇందులో 5 బంగారు పతకాలు, 21 సిల్వర్, 21 కాంస్య పతకాలతో 11వ స్థానంలో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


