Asian Games 2026: భారత్‌కు మరో స్వర్ణం.. రన్నింగ్ రేసులో విజయం!
ఆసియా గేమ్స్ 2026 క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం లభించింది. మహిళల 4X100 మీటర్ల రిలేలో భారత జట్టు విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన ఈ రేసులో కిరణ్ పహల్, పూవమ్మ, ప్రాచీ, విద్యా రామరాజ్‌లతో కూడిన భారత మహిళల టీమ్ 3 నిమిషాల 29.69 సెకన్లలోనే రేసును పూర్తి చేసి పసిడి పతకాన్ని ముద్దాడింది.
ఈ విభాగంలో బలమైన బహ్రెయిన్, చైనా జట్లను వెనక్కి నెట్టి మరీ భారత టీమ్ విజేతగా నిలిచింది. ఈ ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెటిక్స్ టీమ్ గెలుచుకున్న తొలి స్వర్ణం ఇదే కావడం గమనార్హం. 1982 నుంచి ఈ విభాగంలో మహిళల టీమ్ పతకాలు గెలుస్తూ వస్తోంది. 2018 ఆసియా గేమ్స్‌లోనూ భారత 4X400 రిలే మహిళల టీమ్ స్వర్ణ పతకం సాధించింది.
తమిళనాడుకు చెందిన విద్యా రామరాజ్‌కు ఈ ఆసియా గేమ్స్‌లో మూడోపతకం కావడం విశేషం. ఆమె ఈ విజయానికి ముందు 4X 400 మీటర్ల మెడ్లీ రిలేలో రజతం, మహిళల 400 మాటర్ల హర్డిల్స్‌లో కాంస్యం గెలుచుకుంది. తాజా స్వర్ణంతో ఒకే ఆసియా గేమ్స్‌లో గోల్డ్, బ్రాంజ్, సిల్వర్ గెలిచిన భారత అథ్లెట్‌గా రికార్డ్ సాధించింది. స్వర్ణం సాధించిన ఈ నలుగురు సీనియర్ అథ్లెట్లు కిరణ్ పహల్, పూవమ్మ, ప్రాచీ, విద్యా రామరాజ్‌లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 10వ రోజు పోటీల్లో భారత్‌కు రెండు స్వర్ణాలు రావడం గమనార్హం.

పురుషుల టీమ్‌కు కాంస్యం..
ఇదే 4x400 మీటర్ల విభాగంలో భారత పురుషుల టీమ్ కాంస్య పతకం గెలిచింది. ధర్మవీర్ చౌదరి, మను టి, జై కుమార్, విశాల్ టీకేలతో కూడిన భారత పురుషుల టీమ్.. 3 నిమిషాల 01.61 సెకన్లలో రేసును పూర్తి మూడో స్థానంలో నిలిచింది.
ఈ రేసులో జపాన్ టీమ్ 3 నిమిషాల 0.75 సెకన్లతో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకం సాధించగా.. ఖతార్ 3 నిమిషాల 0.93 సెకన్లతో సిల్వర్ మెడల్ గెలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత పురుషుల టీమ్.. ఈసారి బంగారు పతకం గెలవలేకపోయింది. అమ్మాయిలు బంగారం గెలిచినా.. పురుషుల టీమ్ నిరాశపర్చింది.
మిక్స్‌డ్ 4x100 మీటర్ల రిలే టీమ్‌కు కాంస్యమే..
గుర్విందర్‌వీర్, స్నేహ, హరిత, అనిమేష్ ఖుజుర్‌లతో కూడిన మిక్స్‌డ్ రిలే టీమ్ కూడా కాంస్య పతకమే గెలిచింది. భారత రన్నర్లు 41.06 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచారు. గుర్విందర్‌వీర్ సింగ్ మంచి స్టార్ట్ ఇవ్వగా.. స్నేహ టీమ్‌ను పోటీలో నిలిపింది. ఆ తర్వాత అనిమేష్‌కి థాయిలాండ్ రన్నర్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ.. చివర్లో హరిత పవర్ ఫుల్ ఫినిషింగ్‌తో టీమ్‌కు మూడో స్థానంతో పాటు బ్రాంజ్ మెడల్‌ను ఖాయం చేసింది.
ఈ విభాగంలో చైనా 40.78 సెకన్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా..థాయిలాండ్ (40.87 సెకన్లు) రెండో స్థానంలో నిలిచి సిల్వర్ గెలుచుకుంది. భారత్ కేవలం 0.28 సెకన్లు వెనుకంజలో నిలిచి మూడో స్థానంలో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


