Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు కాంస్యం!

ఆసియా గేమ్స్ 2026లో భారత్‌కు మరో కాంస్య పతకం లభించింది. టేబుల్ టెన్నిస్‌ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మనుష్ షా, దియా చితాలే జోడీ బ్రాంజ్ మెడల్ సాధించింది. దాంతో ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 20కి చేరింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో మనుష్ షా దియా చితాలే జోడీ, చైనా జోడీ వాంగ్ షుకిన్-సన్ యింగ్‌షాన్‌ చేతిలో ఓటమిపాలైంది.

Asian Games 2026: భారత్‌కు మరో బంగారు పతకం!

Asian Games 2026: భారత్‌కు మరో బంగారు పతకం!

ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన చైనా జోడీ 11-8, 11-5, 11-8, 11-2 స్కోర్‌తో వరుస సెట్లలో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో తడబడిన భారత జోడీ కాంస్య పతకంతోనే సరిపెట్టుకుంది. చైనా తిరుగులేని ఆధిపత్యం చెలాయించినప్పటికీ, మనుష్ షా, దియా సితాలే జోడీ మిక్స్‌డ్ డబుల్స్ టేబుల్ టెన్ని‌స్‌లో కాంస్య గెలిచి భారత జెండాను రెపరెపలాడించింది.

Asian Games 2026 India s Medal Tally Reaches 20 as Manush Shah Diya Chitale Win Table Tennis Bronze

శుక్రవారం భారత్‌కు ఇది మూడో పతకం కావడం గమనార్హం. షూటింగ్ విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో కమల్ జీత్-సురుచి సింగ్ జోడీ అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని గెలిచిన సంగతి తెలిసిందే.

ఈ భారత ద్వయం ఫైనల్లో 484.6 పాయింట్లతో గోల్డ్‌మెడల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో కమల్‌జీత్-సురుచి జోడీ సరికొత్త చరిత్రను లిఖించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక పాయింట్లు సాధించిన జోడీగా నిలిచింది. ఈ క్రమంలోనే ఉజ్బెకిస్థాన్‌కు చెందిన మహమ్మద్ కమాలోవ్-నిగినా సైద్‌కులోవా పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించింది. ఈ ఉజ్బెకిస్థాన్‌ జోడీ 2023 హంగ్జౌ ఆసియా గేమ్స్‌లో 481.3 పాయింట్లను సాధించింది.

Asian Games 2026: అఫ్గానిస్థాన్‌పై నేపాల్ సంచలన విజయం!

Also Read

Asian Games 2026: అఫ్గానిస్థాన్‌పై నేపాల్ సంచలన విజయం!

పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్‌లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్, రుద్రాంక్ష్ పాటిల్ త్రయం రజత పతకాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారమే జరిగిన ఫైనల్లో భారత్ 1762-94x స్కోరుతో రెండో స్థానంలో నిలవగా.. 1766-95x స్కోరుతో చైనా పసిడిని సొంతం చేసుకుంది. మరోవైపు సౌత్ కొరియా 1751-87x స్కోరుతో కాంస్య పతకాన్ని అందుకుంది. దాంతో భారత్ పతకాల సంఖ్య 19కి చేరింది.

Story first published: Friday, September 25, 2026, 17:13 [IST]
Other articles published on Sep 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+