Asian Games 2026: భారత్‌కు మరో బంగారు పతకం!
ఆసియా గేమ్స్ 2026లో భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. ఆరో రోజైన శుక్రవారం భారత షూటర్లు అదరగొట్టారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో కమల్ జీత్-సురుచి సింగ్ జోడీ అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ భారత ద్వయం ఫైనల్లో 484.6 పాయింట్లతో గోల్డ్‌మెడల్‌ను సొంతం చేసుకుంది.
ఈ విజయంతో కమల్‌జీత్-సురుచి జోడీ సరికొత్త చరిత్రను లిఖించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక పాయింట్లు సాధించిన జోడీగా నిలిచింది. ఈ క్రమంలోనే ఉజ్బెకిస్థాన్‌కు చెందిన మహమ్మద్ కమాలోవ్-నిగినా సైద్‌కులోవా పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించింది. ఈ ఉజ్బెకిస్థాన్ జోడీ 2023 హంగ్జౌ ఆసియా గేమ్స్‌లో 481.3 పాయింట్లను సాధించింది.

కమల్‌జీత్, సురుచి ఆరంభం నుంచే అదరగొట్టారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే టాప్‌లో నిలిచి ఫైనల్‌కి దూసుకెళ్లారు. తొలి సిరీస్ ముగిసేసరికి సౌత్ కొరియాపై భారత్ ద్వయం 4.9 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. కానీ, రెండో సిరీస్ నాటికి కొరియా జోడీ మెరుగైన ప్రదర్శన కనబర్చి ఆ తేడాను 1.2 పాయింట్లకు తగ్గించింది. అయినా భారత జోడీ ఎక్కడా తగ్గకుండా వరుసగా 10 పాయింట్స్ సాధించి సత్తా చాటింది.
18వ షాట్ దగ్గర ఇండోనేషియా రేస్ నుంచి తప్పుకోగా..భారత్ ద్వయం 5.8 పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్ళింది. 20 షాట్ల తర్వాత ఆ లీడ్ ఏకంగా 7.1 పాయింట్లకు పెరిగింది. ఆఖరి రెండు షాట్లు ఉన్నాయనగా ఇండియా 7.2 పాయింట్ల ముందంజలో ఉంది. ఆఖరి ముందు షాట్‌లో సురుచి 10.5 కొట్టగా.. కమల్‌జీత్ 9.5 స్కోర్ చేశాడు. దాంతో భారత్‌కు చారిత్రాత్మక స్వర్ణ పతకం దక్కింది.
మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్‌లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్, రుద్రాంక్ష్ పాటిల్ త్రయం రజత పతకాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారమే జరిగిన ఫైనల్లో భారత్ 1762-94x స్కోరుతో రెండో స్థానంలో నిలవగా.. 1766-95x స్కోరుతో చైనా పసిడిని సొంతం చేసుకుంది. మరోవైపు సౌత్ కొరియా 1751-87x స్కోరుతో కాంస్య పతకాన్ని అందుకుంది. దాంతో భారత్ పతకాల సంఖ్య 19కి చేరింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


