Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: అఫ్గానిస్థాన్‌పై నేపాల్ సంచలన విజయం!

ఆసియా గేమ్స్ 2026లో నేపాల్ సంచలన విజయం నమోదు చేసింది. పురుషుల క్రికెట్‌ లీగ్ దశలో అఫ్గానిస్థాన్‌ను నేపాల్ మట్టికరిపించింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన నేపాల్ 5 వికెట్ల తేడాతో అఫ్గాన్‌ను చిత్తు చేసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 102 పరుగులే చేసింది. ఫైసల్ ఖాన్ అహ్మద్‌జాయ్(33 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 30), నజిబుల్లా జడ్రాన్(40 బంతుల్లో 2 ఫోర్లుతో 30) టాప్ స్కోరర్లుగా నిలవగా.. నంగేయాలియా ఖాన్(17 నాటౌట్) పర్వలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. నేపాల్ బౌలర్లలో కుశాల్ భుర్టెల్(4/21) నాలుగు వికెట్లు తీయగా.. లలిత్ రాజ్‌బన్షి(3/13) మూడు వికెట్లు తీసాడు.

Asian Games 2026 Kushal Bhurtel Lalit Rajbanshi Star as Nepal Beat Afghanistan by Five Wickets

అనంతరం నేపాల్ 17.2 ఓవర్లలో 5 వికెట్లకు 103 పరుగులు చేసి గెలుపొందింది. సుందీప్ జోరా(35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34), రోహిత్ పాడెల్(32 బంతుల్లో 4 ఫోర్లతో 33 నాటౌట్) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో అరబ్ గుల్, అబ్దోల్లా అహ్మద్‌జాయ్, ఫారిదూన్ దావుద్జాయ్ తలో వికెట్ తీసారు. అఫ్గానిస్థాన్‌పై నేపాల్‌కు ఇదే తొలి విజయం. ఈ విజయాన్ని ఆ దేశ అభిమానులు ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. నేపాల్ చేతిలో ఓడినా మెరుగైన రన్‌రేట్ కారణంగా అఫ్గానిస్థాన్ గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచింది.

Asia Games 2026: నో భారత్ X పాక్ మ్యాచ్.. ఎందుకంటే..?

Asia Games 2026: నో భారత్ X పాక్ మ్యాచ్.. ఎందుకంటే..?

టోర్నీ ఫార్మాట్ ఏంటంటే..?

ఈ టోర్నీలో మొత్తం 10 ఆసియా జట్లు మెడల్స్ కోసం పోటీపడుతున్నాయి. మెరుగైన ఐసీసీ ర్యాంకింగ్స్ కలిగిన భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడనుండగా.. ఆతిథ్య జపాన్, అఫ్గానిస్థాన్, నేపాల్, మలేషియా, హాంగ్‌కాంగ్, ఒమన్ గ్రూప్ దశలో పోటిపడుతున్నాయి. ఈ 6 జట్లను రెండు గ్రూప్‌లు‌గా విభజించి రౌండ్ రాబిన్ పద్దతిలో ఆడిస్తున్నారు. గ్రూప్ దశ ముగిసే సరికి ప్రతీ గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంటాయి. ఈ నాలుగు జట్లు వరుసగా భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడుతాయి.

నేపాల్ 'విశ్వరూపం': ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించిన పసికూన!

Also Read

నేపాల్ 'విశ్వరూపం': ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించిన పసికూన!

అఫ్గాన్ క్వార్టర్స్ ఆశలు ఏంటంటే..?

అఫ్గానిస్థాన్.. నేపాల్, జపాన్‌‌తో గ్రూప్-ఏలో ఉంది. ఇప్పటికే రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడిన అఫ్గాన్ జపాన్‌పై గెలిచి నేపాల్ చేతిలో ఓడింది. అఫ్గాన్ క్వార్టర్ ఫైనల్స్ చేరాలంటే.. జపాన్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో నేపాల్ విజయం సాధించాలి. లేదంటే జపాన్ తక్కువ రన్‌రేట్‌తో విజయం సాధించాలి. అప్పుడే అఫ్గాన్ క్వార్టర్స్ చేరగలదు.

Story first published: Friday, September 25, 2026, 14:04 [IST]
Other articles published on Sep 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+