Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: 16 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం!

ఆసియా గేమ్స్ 2026లో భారత్‌కు మరో రెండు పతకాలు దక్కాయి. అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు ఒక రజతం, కాంస్యం వరించింది. 4X400 రిలేలో భారత్ జట్టు రెండో స్థానంలో నిలిచి రజతం సాధించగా.. 10 వేల మీటర్ల రేసులో సీమా కాంస్యం సాధించింది. ఈ విభాగంలో 16 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం రావడం విశేషం.

Asia Games 2026: నో భారత్ X పాక్ మ్యాచ్.. ఎందుకంటే..?

Asia Games 2026: నో భారత్ X పాక్ మ్యాచ్.. ఎందుకంటే..?

తృటిలో చేజారిన స్వర్ణం..

బుధవారం జరిగిన 4X400 రిలే పోరులో మను, పూవమ్మ, విశాల్, విద్యతో కూడిన భారత జట్టు 3:14.46 నిమిషాల్లో రేసును పూర్తి చేసింది. బహ్రెయిన్ జట్టు 3:12.46 నిమిషాల్లో దూసుకెళ్లి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకుంది. కేవలం 8 మిల్లీ సెకన్ల తేడాతో వెనుకబడిన వియాత్నం జట్టు బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టుకుంది.

Asian Games 2026 India Clinch Silver in 4x400m Mixed Relay as Seema Wins Bronze in 10 000m

10 వేల మీటర్ల రేసింగ్‌లో భారత్‌కు కాంస్యం వచ్చింది. అథ్లెట్ సీమా రేసును 32:50.05 నిమిషాల్లో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. చివరిసారిగా 2010లో భారత్ అథ్లెట్లు స్వర్ణం, రజతం గెలిచారు. ఇప్పుడు సీమా కాంస్యంతో మెరిసింది. బహ్రెయిన్‌కు చెందిన విన్‌ప్రెడ్ యవీ స్వర్ణం, జపాన్‌కు చెందిన నొజోమీ తనకా రజతాన్ని కైవసం చేసుకున్నారు. సీమ గోల్డ్ మెడల్ విజేత కంటే 10.87 సెకన్లు మాత్రమే వెనకబడింది.

ప్రధాని అభినందనలు..

సీమాకు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. 'ఆసియా గేమ్స్‌లో 10 వేల మీటర్ల పరుగు పందెంలో బ్రాంజ్ మెడల్ సాధించిన సీమాను చూసి భారత్ గర్విస్తోంది. నిబద్ధతో కూడిన ఆమె పోరాటం నిజంగా అద్భుతం. చాలా ఏళ్ల తర్వాత భారత్‌కు మెడల్ వచ్చింది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా'అని పోస్ట్ పెట్టారు.

పతకాల వేటలో దూసుకెళ్తున్న భారత్: ఐదో రోజు ఏకంగా 5 పతకాలు!

Also Read

పతకాల వేటలో దూసుకెళ్తున్న భారత్: ఐదో రోజు ఏకంగా 5 పతకాలు!

ఐదో రోజు 5 పతకాలు..

వుషు పోటీల్లో రోషిబినా దేవి నాఓరెమ్ రజత పతకంతో మెరవగా.. రోయింగ్‌లో పురుషుల డబుల్ స్కల్స్ విభాగంలో సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్‌ల జోడీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. మిక్స్డ్ స్కీట్ ఈవెంట్లో అనంత్‌జీత్ సింగ్ నరుకా-పరినాజ్ ధాలివాల్ జోడీ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది.

ఇతర టీమ్ ఈవెంట్లలోనూ భార‌త్‌కు విజయాలు దక్కాయి. పురుషుల హాకీ పూల్ మ్యాచ్‌లో భారత్ 8-2 తేడాతో దక్షిణ కొరియాను చిత్తు చేసింది. భారత పురుషుల కబడ్డీ జట్టు అద్భుతమైన ఆటతీరుతో సెమీఫైనల్‌కు అర్హత సాధించి పతకాన్ని ఖాయం చేసుకుంది.

Story first published: Thursday, September 24, 2026, 21:12 [IST]
Other articles published on Sep 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+