పతకాల వేటలో దూసుకెళ్తున్న భారత్: ఐదో రోజు ఏకంగా 5 పతకాలు!
జపాన్‌లోని నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఆసియా క్రీడల ఐదో రోజు (సెప్టెంబర్ 24, 2026) భారత్ మొత్తం 5 పతకాలను సొంతం చేసుకుంది. దీంతో ఇప్పటివరకు భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 17కు చేరింది. అథ్లెటిక్స్, వుషు, రోయింగ్, షూటింగ్ విభాగాల్లో మన అథ్లెట్లు సత్తా చాటగా..పురుషుల కబడ్డీ, హాకీ జట్లు కూడా ఘన విజయాలతో ముందుకు సాగుతున్నాయి.
ఐదో రోజు ఇండింయాకు మిక్స్డ్ 4x400 మీటర్ల రిలేలో అద్భుతమైన ప్రదర్శనతో రజత పతకం లభించింది. అలాగే వుషు పోటీలలో పతకం సాధిస్తుందని భావించిన రోషిబినా దేవి నాఓరెమ్ రజత పతకంతో మెరిసింది. రోయింగ్‌లో పతకాల వేటను కొనసాగిస్తూ పురుషుల డబుల్ స్కల్స్ విభాగంలో సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్‌ల జోడీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. వీటితో పాటు అథ్లెటిక్స్ 10,000 మీటర్ల రేసులో సీమా, మిక్స్డ్ స్కీట్ ఈవెంట్లో అనంత్‌జీత్ సింగ్ నరుకా-పరినాజ్ ధాలివాల్ జోడీ భారత్‌కు కాంస్య పతకాలను అందించారు.

ఇతర టీమ్ ఈవెంట్లలోనూ భారత్ కు శుభపరిణామాలు ఎదురయ్యాయి. పురుషుల హాకీ పూల్ మ్యాచ్‌లో భారత్ 8-2 తేడాతో దక్షిణ కొరియాను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. మరోవైపు భారత పురుషుల కబడ్డీ జట్టు అద్భుతమైన ఆటతీరుతో సెమీఫైనల్‌కు అర్హత సాధించి పతకాన్ని ఖాయం చేసుకుంది. అయితే ఫెన్సింగ్ విభాగంలో మాత్రం భారత క్రీడాకారులకు నిరాశే ఎదురైంది.
2026 ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు సాధించిన మొత్తం పతకాలు
1. ఎలావెనిల్ వలరివన్, సోనమ్ మాస్కర్, విదర్ష వినోద్ - మహిళల 10మీ ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్ (షూటింగ్): రజతం
2. ఎలావెనిల్ వలరివన్ - మహిళల 10మీ ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్ (షూటింగ్): రజతం
3. రుద్రాక్ష్ పాటిల్, హిమాంశు ధిల్లాన్, పార్థ్ రాకేష్ మానే - పురుషుల 10మీ ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్ (షూటింగ్): రజతం
4. సుచిక తరియల్ - మహిళల సాంప్రదాయ 60 కేజీల (మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) - కాంస్యం
5. రుద్రాక్ష్ పాటిల్ - పురుషుల 10మీ ఎయిర్ రైఫిల్ (షూటింగ్): కాంస్యం
6.హిమాంశు ధిల్లాన్ - పురుషుల 10మీ ఎయిర్ రైఫిల్ (షూటింగ్): రజతం
7. మహిళల క్రికెట్ జట్టు: స్వర్ణం
8. రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్, పరినాజ్ ధాలివాల్ - మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్ (షూటింగ్): కాంస్యం
9. అనంత్‌జీత్ సింగ్ నరుకా, మీరాజ్ అహ్మద్ ఖాన్, భావతేగ్ సింగ్ గిల్ - పురుషుల స్కీట్ టీమ్ ఈవెంట్ (షూటింగ్): కాంస్యం
10. జై మీనా (సాఫ్ట్ టెన్నిస్): కాంస్యం
11. మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్): రజతం
12. భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు: కాంస్యం
13. సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ (రోయింగ్, పురుషుల డబుల్ స్కల్స్): కాంస్యం
14. రోషిబినా దేవి నవోరెమ్ (వుషు): రజతం
15. అనంత్‌జీత్ సింగ్ నరుకా, పరినాజ్ ధాలివాల్ - మిక్స్‌డ్ స్కీట్ టీమ్ ఈవెంట్ (షూటింగ్): కాంస్యం
16. సీమ (అథ్లెటిక్స్ - 10,000 మీ): కాంస్యం
17. మిక్స్‌డ్ 4x400 మీ రిలే: రజతం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


