Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Games 2026: నో భారత్ X పాక్ మ్యాచ్.. ఎందుకంటే..?

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026లోనూ భారత్, పాకిస్థాన్ జట్లు తలపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇతర టోర్నీల తరహాలో గ్రూప్ దశలోనే దాయాదీ దేశాలు తలపడటం లేదు. దాంతో ఇరు జట్లు నాకౌట్ చేరడంతో పాటు ఇతర పరిస్థితులు కలిసొస్తే తప్పా భారత్-పాక్ పోరు చూసే అవకాశం అభిమానులకు లేదు.

ఎందుకంటే ఆసియా గేమ్స్ టోర్నీ నిబంధనలు అలా ఉన్నాయి. ఈ టోర్నీలో పురుషుల క్రికెట్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 24 నుంచి మొదలవ్వనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్‌తో అఫ్గానిస్థాన్ తలపడనుంది. ఆసియా క్రీడల చరిత్రలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం ఇది నాలుగోసారి మాత్రమే. ఈ టోర్నీలో మొత్తం 10 ఆసియా జట్లు మెడల్స్ కోసం పోటీపడుతున్నాయి.

అది నా కోచింగ్ కెరీర్‌లోనే కఠిన నిర్ణయం.. ఆ రాత్రి నిద్ర కూడా పట్టలేదు: గంభీర్

అది నా కోచింగ్ కెరీర్‌లోనే కఠిన నిర్ణయం.. ఆ రాత్రి నిద్ర కూడా పట్టలేదు: గంభీర్

టోర్నీ ఫార్మాట్ ఏంటంటే..?

మెరుగైన ఐసీసీ ర్యాంకింగ్స్ కలిగిన భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడనుండగా.. ఆతిథ్య జపాన్, అఫ్గానిస్థాన్, నేపాల్, మలేషియా, హాంగ్‌కాంగ్, ఒమన్ గ్రూప్ దశలో పోటిపడుతున్నాయి.

Asian Games 2026 Why There Is No India vs Pakistan Cricket Match in the Tournament

ఈ 6 జట్లను రెండు గ్రూప్‌లు‌గా విభజించి రౌండ్ రాబిన్ పద్దతిలో ఆడిస్తున్నారు. గ్రూప్ దశ ముగిసే సరికి ప్రతీ గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంటాయి. క్వార్టర్ ఫైనల్స్ తర్వాత సెమీఫైనల్స్ జరుగుతాయి. అక్టోబర్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో క్రికెట్ పోటీలు ముగుస్తాయి.

నో.. భారత్ X పాక్ మ్యాచ్

షెడ్యూల్, డ్రా ప్రకారం.. భారత్, పాకిస్తాన్ జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడవు. ఇరు జట్లు నాకౌట్ దశకు చేరుకుంటేనే భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. సెమీస్‌లో కూడా ఇరు జట్లు తలపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సెమీ-ఫైనల్స్‌లో గెలిస్తే.. అక్టోబర్ 3న జరిగే స్వర్ణ పతకం మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ తలపడతాయి.

ఆసియా గేమ్స్ 2026లో భారత్‌ను ఓడిస్తాం.. అదే మా లక్ష్యం: పాకిస్థాన్ హెడ్ కోచ్

Also Read

ఆసియా గేమ్స్ 2026లో భారత్‌ను ఓడిస్తాం.. అదే మా లక్ష్యం: పాకిస్థాన్ హెడ్ కోచ్

అంతేకాకుండా.. ఒకవేళ రెండు జట్లు సెమీ-ఫైనల్స్‌లో ఓడిపోతే, అక్టోబర్ 3న జరిగే కాంస్య పతకం మ్యాచ్‌లో తలపడవచ్చు. అయితే పాకిస్థాన్ ఫైనల్ చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మరోవైపు భారత్ సెమీస్‌లో ఓడే అవకాశాలు చాలా తక్కువ. మహిళల క్రికెట్‌లో పాకిస్థాన్ సెమీస్‌లో వెనుదిరగ్గా.. భారత్ స్వర్ణం గెలిచింది. భారత్, పాకిస్థాన్ జట్లు తలపడలేదు. పురుషుల క్రికెట్‌లోనూ ఇవే ఫలితాలు పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Story first published: Thursday, September 24, 2026, 18:25 [IST]
Other articles published on Sep 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+