Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒకే రోజు రెండు పసిడి పతకాలు.. ధీరజ్ 'గోల్డెన్ డబుల్' ధమాకా!

టర్కీలోని అంటాల్యా నగరంలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-3 టోర్నీలో భారత స్టార్ ఆర్చర్, ఆర్మీ జవాన్ ధీరజ్ బొమ్మదేవర సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం రికర్వ్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో కుమ్‌కుమ్ మొహోత్‌తో కలిసి స్వర్ణం గెలిచిన కొద్ది గంటల్లోనే.. ధీరజ్ బొమ్మదేవర పురుషుల వ్యక్తిగత విభాగంలోనూ పసిడి పతకాన్ని ముద్దాడాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, దక్షిణ కొరియా దిగ్గజం లీ వూ సియోక్‌ను 7-3 తేడాతో చిత్తు చేసి తన కెరీర్లోనే మొదటి ప్రపంచకప్ వ్యక్తిగత స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఒకే టోర్నీలో రెండు బంగారుపతకాలతో 'గోల్డెన్ డబుల్' సాధించిన ఆటగాడిగా ధీరజ్ బొమ్మదేవర అరుదైన రికార్డు సాధించాడు.

కొరియా దిగ్గజంపై ధీరజ్ వీరోచిత పోరాటం
ప్రపంచ ర్యాంకింగ్స్ లో 18వ స్థానంలో ఉన్న ధీరజ్ బొమ్మదేవర.. ఫైనల్ మ్యాచ్‌లో తన కంటే మెరుగైన ర్యాంక్ ఉన్న కొరియా ఆర్చర్ పై మొదటి నుంచే పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. మొదటి రెండు సెట్లను 30-29, 29-28తో గెలుచుకుని 5-1తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. మూడో సెట్ 27-27తో టైగా ముగిసింది. అయితే నాలుగో సెట్‌లో కొరియా ఆటగాడు లీ పుంజుకుని రెండు 10లు, ఒక 9 స్కోరు చేసి 29-27తో గెలవడంతో ధీరజ్ ఆధిక్యం 5-3కి తగ్గింది. అయినప్పటికీ ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వని భారత ఆర్ఛర్.. నిర్ణయాత్మక ఐదో సెట్‌లో వరుసగా మూడు పర్ఫెక్ట్ 10లు (ఒక X తో సహా) కొట్టి మ్యాచ్‌ను 7-3తో ముగించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

Archery World Cup Dhiraj Bommadevara Bags Historic Golden Double With Individual Recurve Gold

సెమీ ఫైనల్లో అద్భుత విజయం
అంతకు ముందు జరిగిన పురుషుల వ్యక్తిగత సెమీఫైనల్ మ్యాచ్‌లో జర్మనీకి చెందిన మోరిట్జ్ వైసర్‌పై ధీరజ్ అసాధారణ రీతిలో విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఒక దశలో 2-4తో ఓటమి అంచుల్లో నిలిచిన ధీరజ్.. నాలుగో సెట్‌లో వరుసగా మూడు 10లు కొట్టి 30-27తో మ్యాచ్‌ను 4-4తో సమం చేశాడు. చివరిదైన ఐదో సెట్‌లో తీవ్ర ఒత్తిడిలో జర్మనీ ఆటగాడు తడబడి 5 పాయింట్లే సాధించగా.. ధీరజ్ మాత్రం అద్భుతమైన నియంత్రణతో 9, 10, 9 స్కోరు చేసి 28-23తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను 6-4తో గెలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు.

ఒకే రోజు రెండు స్వర్ణాలు.. భారత కీర్తి పతాకం
ఒకే అంతర్జాతీయ వేదికపై కొన్ని గంటల వ్యవధిలోనే రెండు ప్రతిష్టాత్మక స్వర్ణ పతకాలను సాధించి ధీరజ్ బొమ్మదేవర భారత ఆర్చరీ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. మొదట కుమ్‌కుమ్ మొహోత్‌తో కలిసి ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియా జట్టును మిక్స్‌డ్ డబుల్స్‌లో ఓడించడం, ఆ వెంటనే వ్యక్తిగత విభాగంలోనూ కొరియా ఒలింపిక్ మెడలిస్ట్ ను మట్టికరిపించి వ్యక్తిగత కెరీర్లో తొలి ప్రపంచకప్ పసిడిని సాధించడం విశేషం. ధీరజ్ బొమ్మదేవర సాధించిన ఈ డబుల్ ధమాకా విజయంతో అంటాల్యా వేదికగా భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది.

Story first published: Sunday, June 14, 2026, 20:31 [IST]
Other articles published on Jun 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+