Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్చరీలో చరిత్ర సృష్టించిన తెలుగు తేజం.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు!

ఆర్చరీ ప్రపంచకప్ 2026 ఫైనల్లో తెలుగు తేజం ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాడు. మెక్సికోలోని సాల్టిల్లో జరిగిన ఈ పోటీల్లో పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఆర్చర్‌గా ధీరజ్ చరిత్ర సృష్టించాడు.

ఆదివారం అర్ధరాత్రి ముగిసిన ఫైనల్లో అతను షూటాఫ్‌లో జపాన్ ఆర్చర్ నకానిషిపై విజయం సాధించాడు. నిర్ణీత వ్యవధిలో స్కోర్ 5-5తో సమం కావడంతో షూటాఫ్ అనివార్యమైంది. అందులో ధీరజ్ 10 పాయింట్స్ సాధించగా.. నకానిషి 9 పాయింట్లే రాబట్టాడు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత్ నుంచి మహిళల విభాగంలో డోలా బెనర్జీ(2007) మాత్రమే రికర్వ్ బంగారం సాధించింది.

IND vs AFG: అభిషేక్ శర్మ విధ్వంసం.. అఫ్గాన్‌పై భారత్ ఘన విజయం!

IND vs AFG: అభిషేక్ శర్మ విధ్వంసం.. అఫ్గాన్‌పై భారత్ ఘన విజయం!

బంగారు పతకం సాధించిన ధీరజ్‌ బొమ్మదేవరను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ అభినందరించారు. ధీరజ్ సాధించిన ఏపీకి గర్వకారణమని ఎక్స్ వేదికగా కొనియాడారు.

AP CM N Chandrababu Naidu Ministers Nara Lokesh and Pawan Kalyan Hail Dhiraj Bommadevara s Historic Archery Victory

'విజయవాడ ఆర్చరీ మైదానాల నుంచి మెక్సికోలో అంతర్జాతీయ విజేతల వేదిక వరకు! ఒక గొప్ప చరిత్ర నమోదైంది! ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ పురుష ఆర్చర్‌గా నిలిచిన ధీరజ్ బొమ్మదేవరకి హృదయపూర్వక అభినందనలు. ఫైనల్ షూట్-ఆఫ్‌లో ఖచ్చితమైన 10 పాయింట్లు సాధించి, భారత 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ విజయాన్ని ఖాయం చేసుకున్నందుకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశమంతా ఎంతో గర్విస్తోంది.

ధీరజ్, నీ పట్టుదల, ఏకాగ్రత, సంకల్పంతో ఏం సాధించవచ్చో ప్రపంచానికి నిరూపించావు. మన రాష్ట్రంలోని అపారమైన ప్రతిభావంతులకు నువ్వొక గొప్ప స్ఫూర్తి. నీకు ఇంకా ఎన్నో గొప్ప విజయాలు దక్కాలని కోరుకుంటున్నాను. ఇలాగే నీ గురి తప్పకుండా ముందుకు సాగిపో!'అని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

IND vs AFG: ఆ రనౌట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది: అఫ్గాన్ కెప్టెన్

Also Read

IND vs AFG: ఆ రనౌట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది: అఫ్గాన్ కెప్టెన్

భవిష్యత్తులో ధీరజ్ మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి దేశ కీర్తిని మరింత పెంచాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు. ఈ విజయం భారత ఆర్చరీ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిందని పవన్ కళ్యాణ్ కొనియాడారు. అత్యంత ఒత్తిడితో కూడిన వాతావరణంలో జపాన్ క్రీడాకారుడు జున్యా నకానిషిపై షూట్-ఆఫ్‌లో సాధించిన ఈ విజయం, ధీరజ్ అద్భుతమైన సంయమనం, గురి తప్పని కచ్చితత్వానికి నిదర్శనమని ఆయన అభినందించారు.

ప్రపంచ కప్ ఫైనల్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయ పురుష రికర్వ్ ఆర్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ వేదికపై సగర్వంగా ఎగురవేసి, భారతావనికి గర్వకారణంగా నిలిచాడని పవన్ కళ్యాణ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Story first published: Monday, September 14, 2026, 20:55 [IST]
Other articles published on Sep 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+