Asian Games 2026: భారత్ X శ్రీలంక సెమీఫైనల్ రద్దయితే.. ఫైనల్ చేరేది ఎవరంటే?
ఆసియా గేమ్స్ 2026లో క్రికెట్ పోటీలు తుది దశకు చేరాయి. మెరుగైన ఐసీసీ ర్యాంకింగ్స్‌తో నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఫైనల్ చేరాయి. సోమవారం జరగాల్సిన హాంగ్ కాంగ్ X పాకిస్థాన్, భారత్ X అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దవ్వగా.. మంగళవారం జరగాల్సిన నేపాల్ X శ్రీలంక, బంగ్లాదేశ్ X మలేసియా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఒక్క బంతి పడకుండానే తుడిచిపెట్టుకుపోయాయి.
దాంతో అసోసియేట్ దేశాలైన అఫ్గాన్, హాంగ్ కాంగ్, నేపాల్, మలేషియాలకు తీవ్ర నష్టం జరిగింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాల్లో ఉన్న భారత్, పాకిస్థాన్‌లతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్ సెమీస్‌కు అర్హత సాధించగా.. అఫ్గాన్, హాంగ్ కాంగ్, నేపాల్, మలేషియా టోర్నీ నుంచి నిష్క్రమించాయి. అసాధారణ ప్రదర్శనతో క్వార్టర్స్ చేరిన ఈ నాలుగు జట్లను సెమీస్ చేరకుండా వరణుడు అడ్డుకున్నాడు.

వర్షంతో సెమీఫైనల్స్ రద్దయితే..?
గురువారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్ X పాకిస్థాన్, భారత్ X శ్రీలంకలు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. సెమీఫైనల్ మ్యాచ్‌లు కూడా వర్షం రద్దయితే విజేతను ఎలా నిర్ణయిస్తారు? ఫైనల్ చేరే జట్లు ఏంటనే విషయాలు తెలుసుకుందాం.
వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండా సెమీఫైనల్ మ్యాచ్‌లు కూడా రద్దయితే.. మెరుగైన ర్యాంకులు కలిగిన జట్లు ఫైనల్ చేరుతాయి. ఈ లెక్కన భారత్, పాకిస్థాన్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. టీ20ల్లో భారత్ అగ్రస్థానంలో ఉండగా.. పాకిస్థాన్ 6వ, బంగ్లాదేశ్ 8వ, శ్రీలంక 9వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఫైనల్ కూడా రద్దయితే మెరుగైన ర్యాంక్ కలిగిన జట్టుకు గోల్డ్ మెడల్ వరిస్తోంది.
కాంస్య పోరు కూడా జరగకపోతే.. అందులో మెరుగైన జట్టుకు మెడల్ దక్కుతుంది. అయితే కనీసం 5 ఓవర్ల ఆటను అయినా ఆడించేందుకు అంపైర్లు ప్రయత్నిస్తారు. అది సాధ్యం కానప్పుడే సీడింగ్ ర్యాంకుల ద్వారా విజేతను ప్రకటిస్తారు. చైనాలో హాంగ్జౌ వేదికగా జరిగిన గత ఆసియా గేమ్స్‌లోనూ వర్షం మ్యాచ్‌లకు అంతరాయం కలిగించగా.. మెరుగైన ర్యాంక్ కలిగిన భారత్‌కు స్వర్ణ పతకం వరించింది. ఈ సారి కూడా అదే తరహా ఫలితం రిపీట్ అయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ 3న ఫైనల్ జరగనుండగా.. అదే రోజు కాంస్య పోరు కూడా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


