Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: చరిత్ర సృష్టించిన కుంకుమ్ మహోద్.. భారత్‌కు మరో స్వర్ణం!

భారత ఆర్చరీ క్రీడాకారిణి కుంకుమ్ మహోద్ చరిత్ర సృష్టించింది. ఆసియా గేమ్స్ చరిత్రలోనే రికర్వ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించింది. శనివారం జరిగిన ఫైనల్లో 17 ఏళ్ల కుంకుమ్ మహోద్ సౌత్‌ కొరియా అథ్లెట్ ఓయెజిన్‌‌ను ఓడించి పసిడిని సొంతం చేసుకుంది.

ఆసియా గేమ్స్ 2026లో భారత్‌ను ఓడిస్తాం.. అదే మా లక్ష్యం: పాకిస్థాన్ హెడ్ కోచ్

ఆసియా గేమ్స్ 2026లో భారత్‌ను ఓడిస్తాం.. అదే మా లక్ష్యం: పాకిస్థాన్ హెడ్ కోచ్

ఉత్కంఠగా సాగిన ఈ ఫైనల్లో కుంకుమ్ అద్వితీయమైన ప్రదర్శన కనబర్చింది. తొలి సెట్‌ను 29-27 తేడాతో సౌత్ కొరియా స్టార్ ఓయెజిన్ గెలుచుకోగా.. రెండో సెట్‌లో ఇద్దరు ప్లేయర్లు చెరో 10 పాయింట్లు సాధించి 29-29తో సమంగా నిలిచారు. మూడో సెట్‌లో కుంకుమ్ అద్వితీయమైన ప్రదర్శనతో 30-29తో గెలవగా.. మ్యాచ్‌ 3-3తో సమమైంది. నాలుగో సెట్‌లో కొరియా ప్లేయర్ 28-27తో ముందంజలో వేసింది. తప్పక గెలవాల్సిన ఐదో సెట్‌లో కుంకుమ్ అద్భుత ప్రదర్శన కనబర్చింది.

Asian Games 2026 17-Year-Old Kumkum Mohod Creates History with Individual Recurve Archery Gold

వరుసగా మూడు సార్లు 10కి 10 పాయింట్స్ సాధించి 30-28తో సెట్‌ను సొంతం చేసుకుంది. దాంతో మ్యాచ్ 5-5తో డ్రా కావడంతో షూటాఫ్ రౌండ్ నిర్వహించారు. ఈ రౌండ్‌లో సౌత్ కొరియా అథ్లెట్ 8 పాయింట్స్ మాత్రమే సాధించగా.. కుంకుమ్ 9 పాయింట్స్ సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ బెర్త్‌ను కుంకుమ్ ఖాయం చేసుకుంది.

శుక్రవారం భారత మహిళల రిజర్వ్ టీమ్ అద్భుతమైన విజయంతో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఆసియా గేమ్స్ చరిత్రలోనే భారత మహిళల టీమ్ తొలిసారి విజేతగా నిలిచింది. అంకిత భకత్, కీర్తి శర్మ, కుంకుమ్ మహోద్‌లతో కూడిన భారత మహిళల రికర్వ్ టీమ్.. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్‌ కొరియా త్రయంపై విజయం సాధించింది.

IND vs WI: రోహిత్ ఔట్.. జైస్వాల్ ఇన్! వెస్టిండీస్‌తో మూడో వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

Also Read

IND vs WI: రోహిత్ ఔట్.. జైస్వాల్ ఇన్! వెస్టిండీస్‌తో మూడో వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

మరోవైపు, మిక్స్‌డ్ ఫైనల్లో బొమ్మదేవర ధీరజ్, కుంకుమ్ జంట తృటిలో బంగారు పతకాన్ని చేజార్చుకుంది. చైనాపై ఓడి, రజతంతో సరిపెట్టుకుంది. తాజా విజయంతో ఈ ఆసియా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు, ఒక సిల్వర్‌ మెడల్‌తో కుంకుమ్ సత్తా చాటింది.

Story first published: Saturday, October 3, 2026, 9:38 [IST]
Other articles published on Oct 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+