IND vs WI: రోహిత్ ఔట్.. జైస్వాల్ ఇన్! వెస్టిండీస్‌తో మూడో వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో అదరగొట్టిన టీమిండియా ఆఖరి పోరుకు సిద్దమైంది. న్యూ చండీగఢ్ వేదికగా శనివారం జరగనున్న నామమాత్రపు ఆఖరి వన్డేలో వెస్టిండీస్‌తో తలపడనుంది. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మల విధ్వంసకర బ్యాటింగ్‌తో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్.. ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు. న్యూ చండీగఢ్ వేదిక కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ ఆఖరి వన్డేలో కూడా బౌండరీ మోత మోగే అవకాశం ఉంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన నేపథ్యంలో భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. బెంచ్ ఆటగాళ్లకు అవకాశం దక్కవచ్చు.
రోహిత్ ఔట్..?
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఆడిన టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అతని స్థానంలో యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా ఆడించవచ్చు. రోహిత్‌ను కొనసాగించాలనుకుంటే మాత్రం జైస్వాల్ బెంచ్‌కే పరిమితమవుతాడు. రెండో వన్డేలో రోహిత్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. వరుసగా సెంచరీ, డబుల్ సెంచరీ సాధించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రోహిత్‌ను తప్పించలేని పరిస్థితుల్లో జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలనుకుంటే.. కెప్టెన్ గిల్ తన స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది.

సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్‌లో ఆడనుండగా.. నాలుగో స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగనున్నాడు. రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలకు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశాలు రాలేదు. ఆకీబ్ నబీకి మరో అవకాశం ఇస్తామని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే స్పష్టం చేశాడు. కాబట్టి నితీష్ రెడ్డి మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
సిరాజ్ రీఎంట్రీ..
తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న మహమ్మద్ సిరాజ్.. ఆఖరి వన్డే ఆడే అవకాశం ఉంది. ప్రసిధ్ కృష్ణ గాయంతో దూరమవగా.. అతని స్థానంలో అన్షూల్ కాంబోజ్ జట్టులోకి వచ్చినా తుది జట్టులో చోటు కష్టమే. ప్రసిధ్ కృష్ణ స్థానంలో సిరాజ్ ఆడనుండగా.. రెండో పేసర్ ఆకీబ్ నబీ, మూడో పేసర్‌గా గుర్నూర్ బ్రార్ బరిలోకి దిగనున్నారు.
నితీష్ రెడ్డిని ఆడించాలనుకుంటే గుర్నూర్ బ్రార్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. నమన్ ధీర్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. ధ్రువ్ జురెల్‌కు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది.
వెస్టిండీస్‌తో రెండో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ/యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, మహమ్మద్ సిరాజ్
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు :
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహమ్మద్ సిరాజ్, అకిబ్ నబీ, యశస్వి జైస్వాల్, నమన్ ధీర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


