ఆసియా గేమ్స్ 2026లో భారత్‌ను ఓడిస్తాం.. అదే మా లక్ష్యం: పాకిస్థాన్ హెడ్ కోచ్
ఆసియా గేమ్స్ 2026లో భారత్‌ను ఓడిస్తామని పాకిస్థాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ ధీమా వ్యక్తం చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో పాకిస్థాన్ జట్టు ఇబ్బంది పడుతున్నా.. టీ20 ఫార్మాట్‌లో మెరుగ్గానే ఉందన్నాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో బెంచ్ మార్క్ సెట్ చేసిన టీమిండియాకు గట్టి పోటీనిస్తామని తెలిపాడు. ఆసియా కప్ 2025 ఫైనల్ తరహాలోనే ఒత్తిడికి గురి చేస్తామని పేర్కొన్నాడు.
భారత్‌ను ఓడిస్తాం..
ఆసియా గేమ్స్ 2026 కోసం సాహిబ్‌జాదా ఫర్హాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ టీ20 జట్టు జపాన్ బయల్దేరే ముందు మైక్ హెస్సన్ మీడియాతో మాట్లాడాడు. భారత్‌ను ఓడించడమే తమ ఏకైక లక్ష్యమని అన్నాడు. 'పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టు బెంచ్ మార్క్ సెట్ చేసింది. వాళ్లను అందుకోవడమే ఇప్పుడు మా ముందున్న ఏకైక లక్ష్యం. అందుకోసం మేం మా సాయశక్తులా ప్రాక్టీస్ చేసి సన్నదమవుతాం.

ఒకవేళ భారత్‌పై ఆడే అవకాశం వస్తే.. ఆసియా కప్ ఫైనల్ తరహాలోనే ఈసారి కూడా వాళ్లపై ఖచ్చితంగా ఒత్తిడి తెస్తాం. అయితే ఈ మ్యాచ్‌కు వెళ్లడానికి రెండు జట్లు చాలా మ్యాచ్‌లు ఆడాలి. కాబట్టి ఇప్పటి నుంచే అంత దూరం ఆలోచించకుండా.. ప్రస్తుతంపైనే దృష్టి పెడుతున్నాం.
టెస్ట్‌ల్లో వెనుకబడ్డాం..
'మా టెస్టు టీమ్ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. ఈ విషయం మాకు బాగా తెలుసు. కానీ గత 15 నెలల గణంకాలు చూస్తే.. టి20 క్రికెట్‌లో మా విజయాల శాతం ప్రపంచంలోనే మూడు లేదా నాలుగో స్థానంలో ఉంది. మేం భారత్ చేతిలో కొన్నిసార్లు ఓడిపోయాం. ఈ ఫలితాలను కొలమానంగా తీసుకొని పాకిస్తాన్ జట్టును అంచనా వేస్తున్నారు. కానీ మా టీ20 జట్టు బాగానే ఉంది. నేను హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే సమయానికి పాకిస్థాన్ టీ20 ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉంది.
ఇప్పుడు ఐదో స్థానానికి వచ్చాం. దాదాపు 30 పాయింట్స్ పెరిగాయి. వరుసగా సిరీస్‌లు గెలవడంతోనే ఇది సాధ్యమైంది. కేవలం పాకిస్థాన్‌లోనే కాకుండా దుబాయ్, అమెరికా వంటి ప్రదేశాల్లో కూడా సిరీస్‌లు గెలిచాం. కాబట్టి అన్ని ఫార్మాట్లను ఒకే చూసి మాట్లాడటం సరికాదు. వన్డే ప్రపంచకప్ సమయానికి వన్డే జట్టును కూడా మెరుగయ్యేలా తీర్చిదిద్దుతాను. గత 12నెలల్లో వన్డేల్లో కూడా మా ఆట తీరు మెరుగైంది. కానీ ఇంకా పరిపూర్ణమైన జట్టుగా మారాల్సి ఉంది.'అని మైక్ హెస్సన్ చెప్పుకొచ్చాడు.
ఫైనల్లో తలపడే ఛాన్స్..
ఆసియా గేమ్స్ 2026లో భారత్, పాకిస్థాన్ ఫైనల్లో తలపడే అవకాశం ఉంది. మెరుగైన ఐసీసీ ర్యాంకులు కలిగిన భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడుతున్నాయి. క్వార్టర్స్, సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ విజయం సాధిస్తే ఫైనల్లో తలపడుతాయి. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌పై భారత్‌దే పైచేయి సాధిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


