Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: అభిషేక్ శర్మ విధ్వంసం.. అఫ్గాన్‌పై భారత్ ఘన విజయం!

అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ఆదివారం న్యూఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో సమష్టిగా రాణించిన భారత్ 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను ఓడించింది. అర్ష్‌దీప్ సింగ్ తీన్మార్ బౌలింగ్‌కు అభిషేక్ శర్మ ఊచకోత తోడవ్వడంతో భారత్ సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇది నాలుగో విజయం. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

IND vs AFG: బుడ్డోడిని పక్కనపెట్టేందుకు బుద్దుండాలి.. సబ్‌స్క్రిప్షన్ బొక్క!

IND vs AFG: బుడ్డోడిని పక్కనపెట్టేందుకు బుద్దుండాలి.. సబ్‌స్క్రిప్షన్ బొక్క!

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్(44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. మహమ్మద్ నబీ(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/19) మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.

Abhishek Sharma s 82 Arshdeep Singh s 3 Wicket Haul Power India to 7-Wicket Win Over Afghanistan

అనంతరం భారత్ 13.1 ఓవర్లలోనే 3 వికెట్లకు 157 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(32 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(33 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42 ) దూకుడుగా ఆడాడు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్, మహమ్మద్ నబీ తలో వికెట్ తీసారు.

అభిషేక్ ఊచకోత..

సాధారణ లక్ష్య ఛేదనలో భారత్‌కు శుభారంభం దక్కలేదు. వైభవ్ సూర్యవంశీని కాదని సంజూ శాంసన్‌(10)కు ఇచ్చిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేదు. మూడో ఓవర్‌లో‌నే అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి ఇషాన్ కిషన్ రాగా.. అభిషేక్ శర్మ చెలరేగాడు. తనకే సాధ్యమైన విధ్వంసకర బ్యాటింగ్‌తో అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారీ సిక్సర్లతో ఊచకోత కోయడంతో పవర్ ప్లేలోనే భారత్ వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

25 సిక్సర్లు, 15 ఫోర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత!

Also Read

25 సిక్సర్లు, 15 ఫోర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత!

ఆ తర్వాత కూడా అతను చెలరేగడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. 10 ఓవర్లలోనే భారత్ 130 పరుగులు చేసింది. సెంచరీ దిశగా సాగిన అభిషేక్ శర్మను మహమ్మద్ నబీ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 121 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రాగా.. గెలుపు ముంగిట ఇషాన్ కిషన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. తిలక్ వర్మతో కలిసి అయ్యర్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మంగళవారం జరగనుంది.

Story first published: Sunday, September 13, 2026, 22:36 [IST]
Other articles published on Sep 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+