IND vs AFG: ఆ రనౌట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది: అఫ్గాన్ కెప్టెన్
బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని అఫ్గానిస్థాన్ కెప్టెన్ ఇబ్రహీం జడ్రాన్ అన్నాడు. ముఖ్యంగా తన రనౌట్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందని చెప్పుకొచ్చాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఇబ్రహీం జడ్రాన్.. బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమికి ప్రధాన కారణమని తెలిపాడు. 'ఈ పిచ్‌పై మేం భారీ లక్ష్యాన్ని నమోదు చేయాల్సింది. దాంతో మేం ఆశించిన ఫలితం మాకు దక్కలేదు. మాకు మూడు మంచి ఆరంభాలు లభించాయి. కానీ ఆ తర్వాత మేం రాణించలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోయాం. దాంతో భారత్ మాపై ఒత్తిడిని పెంచింది.
మిడిల్ ఓవర్లలో మేం పుంజుకున్నాం. కానీ కావాల్సిన లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయాం. భారత బౌలర్లు, ఫీల్డర్లు అద్భుతంగా రాణించారు. నా రనౌట్ ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెబుతాను. ఇషాన్ కిషన్ బంతి అద్భుతంగా అందుకొని ఫీల్డర్‌కు అందించాడు. ఇదే మ్యాచ్‌ను మలుపు తప్పింది. వారికి మూమెంటమ్‌ను అందించింది.'అని ఇబ్రహీం జడ్రాన్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్(44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. మహమ్మద్ నబీ(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/19) మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 13.1 ఓవర్లలోనే 3 వికెట్లకు 157 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(32 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(33 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42 ) దూకుడుగా ఆడాడు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్, మహమ్మద్ నబీ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


