Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: ఇరాన్‌పై ఘన విజయం.. భారత్‌‌కు నాలుగో స్వర్ణం!

ఆసియా గేమ్స్ 2026లో భారత్ జోరు కొనసాగుతోంది. శనివారం భారత్‌కు మరో స్వర్ణ పతకం లభించింది. భారత మహిళల కబడ్డీ టీమ్ తరహాలోనే సునీల్ కుమార్ సారథ్యంలోని పురుషుల టీమ్ కూడా విజేతగా నిలిచి పసిడిని ముద్దాడింది. శనివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో భారత్ 40-34 తేడాతో ఇరాన్‌పై విజయం సాధించింది. ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌కు ఇది 9వ స్వర్ణం. మొత్తం 10 ఎడిషన్లలో భారత్ 9 సార్లు విజేతగా నిలవగా.. 2018లో ఇరాన్ స్వర్ణ పతకాన్ని అందుకుంది.

Asian Games 2026: ఉత్కంఠ పోరులో విజయం.. భారత్‌కు మరో స్వర్ణం!

Asian Games 2026: ఉత్కంఠ పోరులో విజయం.. భారత్‌కు మరో స్వర్ణం!

ఫస్టాఫ్‌లో ఇరాన్‌దే పైచేయి..

ఇరు జట్లు డిఫెన్స్‌లో సత్తా చాటడంతో మ్యాచ్ హోరాహోరీగా మొదలైంది. ఇరాన్ టాకిల్స్‌తో భారత్ కేవలం ఇద్దరు ఆటగాళ్లకే పరిమితమై 7-9 తేడాతో వెనుకంజలో నిలిచింది. ఆలౌట్‌కు చేరువైన భారత్‌ను జైదీప్ దహీయా సూపర్ ట్యాకిల్‌తో జట్టును ఆదుకున్నాడు. ఇరాన్ స్టార్ ప్లేయర్ మొహమ్మద్రెజా షాద్లూ‌ను అద్భుతంగా ట్యాకిల్ చేశాడు.

Asian Games 2026 Sumit Stars as India Beat Iran to Win Ninth Kabaddi Gold

అక్కడి నుంచి భారత్ ఆధిక్యాన్ని అందుకున్నా.. మ్యాట్‌పై ముగ్గురి కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను కొనసాగించలేకపోయింది. అమిర్‌మొహమ్మద్ జఫర్ దానేష్ 2 పాయింట్ రైడ్‌తో భారత్ ఆలౌట్ అయ్యింది. భారత్ ఆలౌట్ అయినప్పటికీ ఇరు జట్ల పాయింట్లు సమమయ్యాయి. అర్జున్ దేశ్వాల్ అసాధారణమైన రైడింగ్, షాద్లూను డాషింగ్ టాకిల్‌తో భారత్ 16-14తో స్వల్ప ఆధిక్యం సాధించింది. ఆ వెంటనే ఇరాన్.. ముగ్గురు డిఫెండర్ల సాయంతో సూపర్ టాకిల్ చేసి ఫస్టాఫ్ ముగిసే సమయానికి 18-17తో ఆధిక్యంలోకి వెళ్లింది.

సెకండాఫ్‌లో సత్తా చాటి..

సెకండాఫ్‌లోనూ ఇరాన్ వరుస పాయింట్స్ సాధించడంతో భారత్ మళ్లీ ముగ్గురు ప్లేయర్లకే పరిమితమై ఆలౌట్ దిశగా సాగింది. కానీ భారత్ సూపర్ టాకిల్‌తో పాటు అస్లామ్ ఇనామ్‌దార్ సూపర్ రైడ్‌తో పుంజుకుంది. ఈ రైడ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. భారత్ ఇదే జోరును కొనసాగించి ఇరాన్‌ను ఇద్దరు ఆటగాళ్లకే పరిమితం చేసింది. ఇరాన్ కెప్టెన్ ఫాజెల్ అట్రాచలి.. ఒమిద్ కలసి అర్జున్ దేశ్వాల్‌ను సూపర్ టాకిల్ చేసినప్పటికీ.. ఆలౌట్‌ను తప్పించుకోలేకపోయింది. దాంతో భారత్ 29-24తో ఐదు పాయింట్ల ఆధిక్యాన్ని సాధించింది. సుమిత్ మైండ్-బ్లోయింగ్ టాకిల్స్‌తో మ్యాచ్‌ను భారత్‌వైపు మలుపు తిప్పాడు.

అదే నా ఏకైక లక్ష్యం.. ఎంతకైనా తెగిస్తా: విరాట్ కోహ్లీ

Also Read

అదే నా ఏకైక లక్ష్యం.. ఎంతకైనా తెగిస్తా: విరాట్ కోహ్లీ

ఇరాన్ గట్టి పోటీ ఇచ్చినా.. భారత రైడర్లు వరుసగా పాయింట్లు తెచ్చి ఆధిక్యాన్ని పెంచారు. మరో 2 నిమిషాలు ఉందనగా భారత్ 7 పాయింట్స్ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. చివరి వరకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది నాలుగో స్వర్ణం. శనివారం ఉదయం మహిళల కబడ్డీ టీమ్ ఇరాన్‌‌ను ఓడించి మూడో పసిడి పతకాన్ని అందించింది.

Story first published: Saturday, September 26, 2026, 16:34 [IST]
Other articles published on Sep 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+