Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: ఉత్కంఠ పోరులో విజయం.. భారత్‌కు మరో స్వర్ణం!

ఆసియా గేమ్స్ 2026లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. భారత మహిళల కబడ్డీ జట్టు అద్వితీయమైన ప్రదర్శనతో విజేతగా నిలిచి పసిడి పతకాన్ని సాధించింది. శనివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో భారత్ 37-33 తేడాతో ఇరాన్‌ను చిత్తు చేసింది. ఆరంభం నుంచి దూకుడు కనబర్చిన భారత మహిళల కబడ్డీ టీమ్ ఫస్టాఫ్‌లో ఆధిక్యం సాధించింది. కానీ సెకండాఫ్‌లో ఇరాన్ పుంజుకోవడంతో ఫలితంపై ఉత్కంఠ రేగింది.

Asian Games 2026: భారత్‌కు మరో బంగారు పతకం!

Asian Games 2026: భారత్‌కు మరో బంగారు పతకం!

చివర్లో భారత రైడర్లు సత్తా చాటడంతో భారత్‌కు విజయం దక్కింది. దాంతో ఆసియా గేమ్స్ చరిత్రలో భారత మహిళల కబడ్డీ టీమ్ నాలుగోసారి విజేతగా నిలిచింది. 2010 ఆసియా గేమ్స్‌లో కబడ్డీని చేర్చగా.. 2018లో మాత్రం భారత్ పసిడిని చేజార్చుకుంది. ఆ ఎడిషన్‌లో ఇరాన్ విజేతగా నిలిచింది.

Asian Games 2026 India Women Beat Iran in Thrilling Kabaddi Final to Win Gold Medal

రఫ్ఫాడించిన సంజూ, నికితా, పూజ

తాజా ఎడిషన్‌లో పుష్ఫా రాణి సారథ్యంలోని భారత మహిళల కబడ్డీ టీమ్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగినప్పటికీ.. ఇరాన్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంది. ఫైనల్లో భారత్ రైడర్లు సంజు దేవి, నికితా, పూజ సత్తా చాటగా.. ఇరాన్ డిఫెన్స్‌లో ఆకట్టుకుంది. ఫస్టాఫ్‌లో ఇరాన్ సూపర్ టాకిల్ సాధించినప్పటికీ.. భారత్ 22-16తో స్వల్ప ఆధిక్యం సాధించింది.

Asian Games 2026: దుమ్మురేపిన భారత కబడ్డీ జట్లు!

Also Read

Asian Games 2026: దుమ్మురేపిన భారత కబడ్డీ జట్లు!

సెకండాఫ్‌లో ఇరాన్ రైడర్ సానియా నయిమీ దుమ్మురేపింది. వరుసగా పాయింట్స్ సాధించింది. కానీ భారత్‌ను త్వరగా ఆలౌట్ చేయకపోవడం ఇరాన్‌కు నష్టం చేసింది. ఆట మరో 8 నిమిషాల్లో ముగుస్తుందనగా అతెనా మదాడి భారత్‌ను 'ఆలౌట్' చేసి వ్యత్యాసాన్ని ఒక్క పాయింట్‌కు తగ్గించింది. కానీ ఆఖరి నిమిషాల్లో భారత రైడర్లు, డిఫెండర్లు సమష్టిగా రాణించి మ్యాచ్‌ను కైవసం చేసుకుని స్వర్ణాన్ని ముద్దాడారు.

బంగారు తల్లులు

ఈ ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఇది మూడో స్వర్ణం కాగా.. ఇందులో రెండు మహిళల టీమ్స్ సాధించడం గమనార్షం. భారత మహిళల క్రికెట్ టీమ్ తొలి స్వర్ణం అందించగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ మిక్స్‌డ్ షూటింగ్ ద్వయం కమల్జీత్, సురుచి రెండో పసిడిని అందజేసింది. తాజాగా కబడ్డీ టీమ్ మూడో పసిడిని గెలవగా.. భారత పురుషుల టీమ్ కూడా ఫైనల్ మ్యాచ్‌కు సిద్దమైంది. మధ్యాహ్నం జరిగే తుదిపోరులో ఇరాన్‌తోనే అమీతుమీ తేల్చుకోనుంది.

Story first published: Saturday, September 26, 2026, 10:52 [IST]
Other articles published on Sep 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+