Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: దుమ్మురేపిన భారత కబడ్డీ జట్లు!

ఆసియా గేమ్స్ 2026లో భారత కబడ్డీ జట్లు దుమ్మురేపుతున్నాయి. మహిళల, పురుషుల టీమ్స్ వరుసగా విజయాలు సాధించాయి. బుధవారం జరిగిన గ్రూప్ దశల్లో భారత పురుషుల, మహిళల టీమ్స్ అద్భుత విజయాలను అందుకున్నాయి. మహిళల టీమ్ బంగ్లాదేశ్, ఇరాన్ జట్లను మట్టికరిపించగా.. పురుషుల టీమ్ జపాన్, బంగ్లాదేశ్‌లను ఓడించింది. జపాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 49-24 తేడాతో విజయం సాధించింది.

Asian Games 2026: మీరాబాయి చానుకు రజతం.. 28 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం!

Asian Games 2026: మీరాబాయి చానుకు రజతం.. 28 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం!

బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 48-25 తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. వరుసగా రెండు విజయాలతో గ్రూప్-ఏలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ ఇంకా రెండు గ్రూప్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. గ్రూప్ దశ ముగిసిన తర్వాత పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.

Asian Games 2026 India s Men and Women Kabaddi Teams Secure Wins Over Bangladesh and Iran

అదరగొట్టిన అమ్మాయిలు..

మహిళల కబడ్డీలోనూ భారత్ వరుసగా రెండు విజయాలు సాధించింది. గ్రూప్-ఏ తొలి మ్యాచ్‌లో 42-21 తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. బుధవారం ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 37-23 తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మహిళల టీమ్ కూడా గ్రూప్-ఏలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఈ విజయాలపై భారత మహిళల కబడ్డీ కోచ్ నీతా తత్వే సంతోషం వ్యక్తం చేశారు. 'మేం ఇరాన్‌పై ఒక పటిష్టమైన వ్యూహాన్ని రచించాం. మైదానంలో ఆట చాలా ఉత్సాహంగా .. కఠినంగా సాగింది. మేం ఇరాన్‌ను 10 పాయింట్లకు పైగా తేడాతో ఓడించడం ఇదే తొలిసారి. గతంలో జరిగిన మ్యాచ్‌లన్నీ చాలా స్వల్ప తేడాతో ఓడించాం. విశ్వవేదికపై భారత్‌ను ఎవరూ ఓడించలేరు.

Jay Meena: ఎవడీడు? క్రికెటర్ కాబోయి.. సాఫ్ట్ టెన్నిస్‌లో మెడల్ సాధించాడు!

Also Read

Jay Meena: ఎవడీడు? క్రికెటర్ కాబోయి.. సాఫ్ట్ టెన్నిస్‌లో మెడల్ సాధించాడు!

కబడ్డీలో భారత్ ఎల్లప్పుడూ నంబర్ వన్‌గా ఉంది. ఇది మా సాంప్రదాయ ఆట. ఇది భారత్‌లోనే పుట్టింది. మా దగ్గర అద్భుతమైన టెక్నిక్, వేగం, బలం ఉన్న ఆటగాళ్లు కోచ్‌లు ఉన్నారు. మేమే అత్యుత్తమమని మాకు పూర్తి నమ్మకం ఉంది. జట్టులోని ఆటగాళ్లందరూ అత్యుత్తములే. ది బెస్ట్ కోచ్‌లు కూడా ఉన్నారు. ముఖ్యంగా పుజా, నికిత జట్టుకు స్టార్లు'అని నీతా తత్వే చెప్పుకొచ్చారు.

Story first published: Wednesday, September 23, 2026, 17:36 [IST]
Other articles published on Sep 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+