Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: ఉత్కంఠ పోరులో పా‌క్‌పై భారత్ విజయం!

ఆసియా గేమ్స్ 2026లో భారత పురుషుల హాకీ టీమ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దాయాదీ పాకిస్థాన్‌తో గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ ఒక్క గోల్ తేడాతో గెలుపొందింది. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ సెమీఫైనల్లో భారత్ 4-3 తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. 60వ నిమిషంలో అభిషేక్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.

Hockey World Cup 2026: ముగిసిన భారత్ పోరాటం.. అర్జెంటీనా ఘన విజయం!

Hockey World Cup 2026: ముగిసిన భారత్ పోరాటం.. అర్జెంటీనా ఘన విజయం!

భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్(5వ, 13వ నిమిషం) చేయగా.. సుఖ్‌జిత్ సింగ్(23వ నిమిషం), అభిషేక్(60వ నిమిషం) చెరో గోల్ కొట్టారు. పాకిస్థాన్ తరఫున కెప్టెన్ అబూ బాకర్ మహమూద్(30వ నిమిషం), హనన్ షాహిద్(45వ నిమిషం), వాహిద్ రాణా(49వ నిమిషం) తలో గోల్ నమోదు చేశారు. ఆదివారం జరిగే తుదిపోరులో మలేషియా, సౌత్ కొరియా మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ విజేతతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే స్వర్ణ పతకంతో పాటు లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ బెర్త్ భారత్‌కు దక్కనుంది.

Asian Games 2026 Abhishek Stars as India Beat Pakistan 4-3 in Thriller to Reach Final

భారత్ జోరు..

ఈ సెమీఫైనల్లో ఆరంభం నుంచే భారత్ జోరు కనబర్చింది. ఆట ఐదో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచి భారత్‌కు 1-0తో ఆధిక్యం అందించాడు. ఇక 13వ నిమిషంలో లభించిన ఏడో పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచి భారత్ ఆధిక్యాన్ని 2-0తో డబుల్ చేశాడు. ఈ గోల్‌పై పాక్ సమీక్షకు వెళ్లినా నిరాశే ఎదురైంది.

రెండో క్వార్టర్ ఆరంభంలోనే పాకిస్థాన్‌కు తొలి పెనాల్టీ కార్నర్ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. 23వ నిమిషంలో సుఖ్‌జిత్ సింగ్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో భారత్ ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు. రెండో క్వార్టర్‌లో పాక్ ఎదురు దాడి చేసినప్పటికీ.. భారత్ సమర్థవంతంగా ఎదుర్కొన్ని ఆధిపత్యాన్ని కొనసాగించింది. 30వ నిమిషంలో పాకిస్థాన్ కెప్టెన్ అబూ మహ్మద్ తమ ఐదో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి పాక్ ఖాతా తెరిచాడు. దాంతో ఫస్టాఫ్ 3-1తో ముగిసింది.

Asian Games 2026: శ్రీలంకపై భారత్ ఘన విజయం.. పాక్‌తో ఫైనల్‌!

Also Read

Asian Games 2026: శ్రీలంకపై భారత్ ఘన విజయం.. పాక్‌తో ఫైనల్‌!

పుంజుకున్న పాక్..

సెకండాఫ్‌లో పాకిస్థాన్ పుంజుకుంది. భారత ప్లేయర్ దిల్‌ప్రీత్ సింగ్ గ్రీన్ కార్డ్‌తో మైదానం బయటకు వెళ్లిపోవడం పాక్‌కు కలిసొచ్చింది. 45వ నిమిషంలో హనన్ షాహిద్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో భారత్ ఆధిక్యాన్ని 3-2కు తగ్గించాడు. 49వ నిమిషంలో వాహిద్ రానా మరో స్టన్నింగ్ ఫీల్డ్ గోల్‌తో పాకిస్థాన్‌ను రేసులోకి తీసుకొచ్చాడు.

స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి 10 నిమిషాల్లో ఇరు జట్లు చేసిన గోల్ ప్రయత్నాలు ఫలించలేదు. మ్యాచ్‌ డ్రాగా ముగుస్తుందనుకున్న క్రమంలో అభిషేక్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో 4-3తో భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Thursday, October 1, 2026, 14:59 [IST]
Other articles published on Oct 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+