Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: శ్రీలంకపై భారత్ ఘన విజయం.. పాక్‌తో ఫైనల్‌!

ఆసియా గేమ్స్ 2026లో భారత పురుషుల క్రికెట్ టీమ్ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన భారత్ 124 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. శ్రీలంక కనీస పోటీ ఇవ్వలేకపోయింది. నేపాల్, హాంగ్ కాంగ్ కంటే అధ్వాన్నంగా ఆడింది.

IND vs WI: ఆ ఒక్క తప్పిదమే మా ఓటమిని శాసించింది: వెస్టిండీస్ కెప్టెన్

IND vs WI: ఆ ఒక్క తప్పిదమే మా ఓటమిని శాసించింది: వెస్టిండీస్ కెప్టెన్

ఇషాన్ కిషన్ విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 80 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. వైభవ్ సూర్యవంశీ(21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) దూకుడుగా ఆడాడు. శ్రీలంక బౌలర్లలో తారిండు రత్నాయకే, సహాన్ అరాచ్‌చిగే రెండేసి వికెట్లు తీయగా.. వానుజా సాహన్, లసిత్ క్రూస్పుల్లే, నువానిడు ఫెర్నాండో తలో వికెట్ తీసారు.

IND vs SL Ishan Kishan Unbeaten 80 and Clinical Bowling Help India Reach Asian Games 2026 Final

అనంతరం శ్రీలంక 9.5 ఓవర్లలో 45 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జస్‌ప్రీత్ బుమ్రా(2/7),అక్షర్ పటేల్(2/8), అభిషేక్ శర్మ(2/2) రెండేసి వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించారు. వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ దక్కింది. ఫైనల్ చేరిన భారత్‌కు కనీసం రజత పతకం ఖాయమైంది. శనివారం జరిగే ఫైనల్లో దాయాదీ పాకిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది.

IND vs WI: మా విజయానికి కారణం అదే: శుభ్‌మన్ గిల్

Also Read

IND vs WI: మా విజయానికి కారణం అదే: శుభ్‌మన్ గిల్

రఫ్ఫాడించిన భారత బౌలర్లు..

170 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన తొలి ఓవర్‌లోనే శ్రీలంక ఒక్క పరుగు చేయకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. రవి బిష్ణోయ్ వేసిన రెండో ఓవర్‌లో రనౌట్ రూపంలో మరో వికెట్ పడగా.. నాలుగో ఓవర్‌లో అక్షర్ పటేల్ మరో రెండు వికెట్లు పడగొట్టాడు. ఐదో ఓవర్‌లో కాస్త నిలకడగా ఆడిన నువానిడు ఫెర్నాండో(15) కూడా రనౌట్ అయ్యాడు. ఏడో ఓవర్‌లోవాషింగ్టన్ సుందర్ మరో వికెట్ పడగొట్టగా.. 10వ ఓవర్‌లో అభిషేక్ శర్మ రెండు వికెట్లు తీసాడు. అదే ఓవర్‌లో తారిండు రత్నాయకే రనౌట్ అయ్యాడు.

బంగ్లాదేశ్‌పై పాక్ విజయం..

తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‌ చేరింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించగా.. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 7 వికెట్లకు 111 పరుగులు చేసింది. టౌహిడ్ హృదయ్(42) ఒక్కడే రాణించాడు. పాక్ బౌలర్లలో సుఫ్యాన్ మోకిమ్(3/26) మూడు వికెట్లు తీయగా..అరఫత్ మిన్హాస్(2/23) రెండు వికెట్లు పడగొట్టాడు. సైమ్ అయూబ్ ఒక వికెట్ తీసాడు.

అనంతరం పాకిస్థాన్ 11.3 ఓవర్లలో 4 వికెట్లకు 112 పరుగులు చేసి గెలుపొందింది. అబ్దుల్ సమద్(15 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 30 నాటౌట్), హసన్ నవాజ్(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27 నాటౌట్) రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహ్‌దీ హసన్, నాసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, రిషాద్ హోస్సేన్ తలో వికెట్ తీసారు.

Story first published: Thursday, October 1, 2026, 12:42 [IST]
Other articles published on Oct 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+