Harry Kane: 25 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇంగ్లండ్ కెప్టెన్‌కు ప్రతిష్టాత్మక బ్యాలన్ డీ ఓర్ అవార్డ్
ఇంగ్లండ్ ఫుట్‌బాల్ కెప్టెన్ హ్యారీ కేన్ చరిత్ర సృష్టించాడు. ఫుట్‌బాల్ గేమ్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే బాలన్ డీ ఓర్ 2026 అవార్డును సొంతం చేసుకున్నాడు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ అవార్డ్ గెలుచుకున్న ఇంగ్లండ్ ఆటగాడిగా హ్యారీ కేన్ రికార్డ్ సాధించాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ కోసం ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపె, స్పెయిన్ సెన్సేషన్ లామిన్ యమాల్, అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీలు పోటీపడగా.. హ్యారీ కేన్‌కు ఈ అవార్డు లభించింది.
2001 తర్వాత ఇంగ్లండ్ ఫుట్‌బాల్ ప్లేయర్ ఈ బాలన్ డీ ఓర్ పురస్కారం అందుకోవడం ఇదే తొలిసారి. చివరిసారిగా మైకెల్ ఓవెన్ 2001లో ఈ అవార్డును అందుకున్నాడు. ఇక మహిళల విభాగంలో ఈ ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డ్‌ను స్పెయిన్ స్టార్ అలెక్సియా పుటెల్లాస్ అందుకుంది. ఈ అవార్డ్‌ను స్వీకరించడం ఆమెకు ఇది మూడోసారి.
అసలు ఏంటి ఈ బ్యాలన్ డీ ఓర్ అవార్డ్..?
బ్యాలెన్ డీ ఓర్ అనేది ఫుట్‌బాల్ ప్రపంచంలోనే ఒక ఆటగాడికి లభించే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యున్నతమైన వ్యక్తిగత పురుస్కారం. ఈ అవార్డును 1956లో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ న్యూస్ పేపర్.. 'ఫ్రాన్స్ ఫుట్‌బాల్' ప్రారంభించింది. ఒక సీజన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పురుషు, మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లకు వేర్వేరుగా ఈ అవార్డును అందజేస్తారు.

ఈ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్లలో నుంచి ఒకరిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముక స్పోర్ట్స్ జర్నలిస్ట్‌ల ఓట్ల ద్వారా ఎంపిక చేస్తారు. 1995 వరకు యూరోపియన్ ఆటగాళ్లకు మాత్రమే ఈ అవార్డు ఇచ్చేవారు. కానీ 2007 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏ లీగ్ ఆడిన ఆటగాడినైనా ఈ అవార్డుకు అర్హుడిగా నిబంధనను మార్చారు. 2018 నుంచి మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లకు బ్యాలెన్ డీ ఓర్ ఫెమినిన్ అనే పేరుతో అందజేస్తున్నారు. ఈ అవార్డును అత్యధికంగా లియోనెల్ మెస్సీ 9 సార్లు గెలుచుకోగా.. క్రిస్టియానో రొనాల్డో 5 సార్లు సొంతం చేసుకున్నాడు.
ఎంబాపెను ఓడించిన హ్యారీ కేన్..
ఈ సారి బాలన్ డీ ఓర్ రేసులో హ్యారీ కేన్ అగ్రస్థానం సాధించగా.. కైలియన్ ఎంబాపె, లామిన్ యమల్, రోడ్రి, లియోనెల్ మెస్సీ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇంగ్లండ్ కెప్టెన్‌గా హ్యారీ కేన్ ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. బేయర్న్ మునిచ్ ఫుట్‌బాల్ క్లబ్‌కు వరుసగా రెండు ట్రోఫీలు అందించిన హ్యారీ కేన్.. 2026 ఫిఫా ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను మూడో స్థానంలో నిలిపాడు. ఈ టోర్నీలో ఏడు మ్యాచ్‌లు ఆడిన హ్యారీ కేన్ 6 గోల్స్ చేయడంతో పాటు ఒక అసిస్ట్ అందించాడు.
అవార్డుల వివరాలు..
పురుషుల బాలన్ డి ఓర్: హ్యారీ కేన్
మహిళల బాలన్ డి ఓర్: అలెక్సియా పుటెల్లాస్
పురుషుల క్లబ్ ఆఫ్ ది ఇయర్: పారిస్ సెయింట్-జెర్మైన్
మహిళల క్లబ్ ఆఫ్ ది ఇయర్: ఎఫ్‌సి బార్సిలోనా
పురుషుల కోచ్ ఆఫ్ ది ఇయర్: లూయిస్ డి లా ఫ్యూంటె
మహిళల కోచ్ ఆఫ్ ది ఇయర్: పెరె రోమ్యూ
పురుషుల కోపా ట్రోఫీ: లామిన్ యమల్
మహిళల కోపా ట్రోఫీ: విక్కీ లోపెజ్
పురుషుల యాషిన్ ట్రోఫీ: ఉనై సైమన్
మహిళల యాషిన్ ట్రోఫీ: కాటా కోల్
పురుషుల గెర్డ్ ముల్లర్ ట్రోఫీ: హ్యారీ కేన్
మహిళల గెర్డ్ ముల్లర్ ట్రోఫీ: చార్లిన్ కొర్రల్
సోక్రటీస్ అవార్డు: బుకాయో సాకా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


