లియోనల్ మెస్సీ ఆస్తి ఎంతో తెలుసా.. తెలిస్తే షాకవ్వాల్సిందే!
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఓ గొప్ప అధ్యాయం ముగిసింది. లెజండరీ ప్లేయర్, అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ భావోద్వేగ లేఖ ద్వారా వెల్లడించాడు.
రెండు దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌కు వీడ్కోలు పలకడం బాధగానే ఉందన్న మెస్సీ.. కానీ తప్పలేదన్నాడు. రిటైర్ కావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ ముగిసిన వెంటనే ఈ నిర్ణయాన్ని ప్రకటించాలనుకున్నానని, కానీ తన తండ్రి అనారోగ్యం కారణంగా పోస్ట్ చేయలేకపోయానని వెల్లడించాడు.

207 మ్యాచ్‌ల్లో 125 గోల్స్..
అర్జెంటీనా తరఫున 2026లో అరంగేట్రం చేసిన మెస్సీ.. 207 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 125 గోల్స్ నమోదు చేశాడు. మరో 64 గోల్స్‌కు అసిస్ట్ చేశాడు. 2006లో క్రొయేషియాపై తొలి గోల్ నమోదు చేసిన మెస్సీ.. 2026 ప్రపంచకప్‌లో ఈజిప్ట్‌పై ఆఖరి గోల్ కొట్టాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో(233 మ్యాచ్‌ల్లో 146 గోల్స్) తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
అయితే అత్యధిక ప్రపంచకప్‌లు ఆడిన ఆటగాడిగా మెస్సీ రికార్డ్ సాధించాడు. అతను 6 ప్రపంచకప్‌లు ఆడి 21 గోల్స్ నమోదు చేశాడు. గతంలో 2016 కోపా అమెరికా ఫైనల్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సీ.. తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికినా.. ఫ్రాంచైజీ లీగ్స్‌లో కొనసాగనున్నాడు. మేజర్ లీగ్ సాకర్ క్లబ్‌లో ఇంటర్ మయామి కెప్టెన్ అతను.
కళ్లు చెదిరే నెట్ వర్త్..
ఈ 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో లియోనెల్ మెస్సీ కళ్లు చెదిరే రీతిలో ఆస్తులు కూడగట్టాడు. తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న మెస్సీ.. ఫుట్‌బాల్ టీమ్ కాంట్రాక్ట్స్, కమర్షియల్ ఎర్నీంగ్స్ ద్వారా కోట్ల రూపాయాలు ఆర్జించాడు. ప్రస్తుతం అతను ఏడాదికి 140 మిలియన్ డాలర్లు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది.
మెస్సీ రిటైర్మెంట్ నేపథ్యంలో అతని నెట్‌వర్త్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఫోర్బ్స్ అంచనా ప్రకారం లియోనల్ మెస్సీ నెట్ వర్త్ 1.1 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.10,590 కోట్లు. బార్సిలోనా క్లబ్ నుంచి మొదలైన మెస్సీ ఆర్థిక ప్రస్థానం పారిస్ సెయింట్ జర్మైన్, ఇంటర్ మియామీ అగ్రిమెంట్స్ ద్వారా పీక్స్‌కు చేరింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

