FIFA World Cup 2026: స్పెయిన్‌కు రూ.481 కోట్ల ప్రైజ్‌మనీ.. అవార్డుల పూర్తి జాబితా ఇదే!
ఫిఫా ప్రపంచకప్ 2026లో విజేతగా నిలిచిన స్పెయిన్‌కు రూ.481 కోట్ల భారీ ప్రైజ్‌మనీ దక్కింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి ఉత్కంఠగా సాగిన ఫైనల్లో స్పెయిన్ 1-0తో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించి విశ్వ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో మ్యాచ్ నిర్ణీత సమయంలో ఫలితం తేలలేదు. దాంతో ఎక్స్‌ట్రా టైమ్ ఆడించాల్సి వచ్చింది. ఈ సమయాన్ని స్పెయిన్ సద్వినియోగం చేసుకుంది.
106వ నిమిషంలో స్పెయిన్ ప్లేయర్ ఫెర్రాన్ టొర్రెస్ అసాధారణ గోల్‌తో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ విజయంతో స్పెయిన్ రెండో ఫిఫా ప్రపంచకప్‌ను ముద్దాడింది. 2010లో తొలి ప్రపంచకప్‌ను గెలుచుకున్న స్పెయిన్.. 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ విశ్వవిజేతగా నిలిచింది. దాంతో స్పెయిన్‌కు రూ.481 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్ దక్కింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే ఇది అత్యధిక క్యాష్ ప్రైజ్. గత ఛాంపియన్ కంటే ఈ సారి 8 మిలియన్ డాలర్లు ఎక్కువ.

అర్జెంటీనాకు రూ.317 కోట్లు..
నాలుగేళ్ల క్రితం ఖతార్‌లో విశ్వవిజేతగా నిలిచి మళ్లీ టైటిల్ నిలబెట్టుకోవాలని భావించిన డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు ఈసారి నిరాశే ఎదురైంది. స్పెయిన్ టికి టాకా వ్యూహం ముందు అర్జెంటీనా తేలిపోయింది. రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనాకు రూ. 317 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్ దక్కింది. గత రన్నరప్ కంటే ఈ ప్రైజ్‌మనీ 3 మిలియన్ డాలర్లు ఎక్కువ.
మూడో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌కు రూ.279 కోట్లు, నాలుగో స్థానంలో నినలిచిన ఫ్రాన్స్‌కు రూ.259 కోట్ల ప్రైజ్‌మనీ వరించింది. క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన జట్లకు రూ.182 కోట్లు, ప్రిక్వార్టర్స్‌లో ఓడిన టీమ్స్‌కు రూ.144 కోట్లు, గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టిన ప్రతీ జట్టుకు రూ.105 కోట్ల నగదు పురస్కారం దక్కనుంది. గత ఛాంపియన్‌షిప్‌తో పోలిస్తే ఈ సారి నగదు పురస్కారాలను మొత్తం 50 శాతం పెంచారు.
ఫిఫా ప్రపంచకప్ 2026 అవార్డుల జాబితా
గోల్డెన్ బాల్ - రోడ్రీ (స్పెయిన్)
సిల్వర్ బాల్ - లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా)
బ్రాంజ్ బాల్ - కిలియన్ ఎంబాపే (ఫ్రాన్స్)
గోల్డెన్ బూట్ - కిలియన్ ఎంబాపే (ఫ్రాన్స్) -10 గోల్స్ (4 అసిస్ట్‌లు)
సిల్వర్ బూట్ - లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా)-8 గోల్స్ (4 అసిస్ట్‌లు)
బ్రాంజ్ బూట్ - జూడ్ బెల్లింగ్‌హామ్ (ఇంగ్లాండ్)-7 గోల్స్
గోల్డెన్ గ్లోవ్ - ఉనాయ్ సిమోన్ (స్పెయిన్)
ఫిఫా యంగ్ ప్లేయర్ - పావ్ కుబార్సి (స్పెయిన్)
ఫిఫా ఫెయిర్ ప్లే అవార్డు - నెదర్లాండ్స్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

