Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్పెయిన్ కొంపముంచిన ఫుట్‌బాల్ మ్యాచ్.. పిట్టల్లా రాలుతున్న జనం!!

Football Match Blamed For COVID-19 Spread In Spain

మాడ్రిడ్‌ : కరోనా వైరస్‌తో స్పెయిన్ గజగజ వణికిపోతోంది. ఈ ప్రాణాంతక వ్యాధి సోకిన వారి సంఖ్య వేలల్లో ఉండటంతో జనం పిట్టల్లా రాలుతున్నారు. సోమవారం ఒక్కరోజే 812 మంది మరణించినట్లు స్పెయిన్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. దీంతో కరోనా కారణంగా ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య 7,340కి చేరింది. స్పెయిన్ ప్రిన్సెస్ మారియా థెరిస్సా కూడా కరోనా సోకి చనిపోయిన సంగతి తెలిసిందే.

స్పెయిన్‌లో ఇప్పటివరకూ 85,195 మందికి కరోనా సోకింది. ఇదిలా ఉంటే.. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో వారికి సేవ చేయడం స్పెయిన్‌లోని వైద్యులు, వైద్య సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా ఎక్కువగా మరణాలు సంభవించిన ఇటలీ తరువాత స్పెయిన్‌ రెండో స్థానంలో నిలిచింది.

ఇటలీలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..

ఇటలీలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..

అయితే స్పెయిన్‌లో ఇంత దయనీయ స్థితి ఏర్పడటానికి ఇటలీలో జరిగిన ఓ ఫుట్ బాల్ మ్యాచే కారణమని స్పెయిన్ వైద్యులు విశ్లేషిస్తున్నారు. ఫిబ్రవరి 19న ఇటలీలోని మిలన్‌ నగరంలో జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు స్పెయిన్‌ నుంచి 3వేల మంది వెలన్షియా క్లబ్‌ అభిమానులు హాజరయ్యారు. అప్పటికే ఇటలీలో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు 40 వేల మంది ఇటాలియన్లు కూడా వచ్చారు. వీరిలో ఎక్కువమంది ఇటలీలోని ఉత్తర ప్రాంతమైన లొంబర్డీకి చెందినవారు.

మార్చి 31: సచిన్‌కు గుడ్ డే.. టీమిండియాకు బ్యాడ్ డే!!

మ్యాచ్ చూసిన వారే బాధితులు..

మ్యాచ్ చూసిన వారే బాధితులు..

ఈ ప్రాంతంలో కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. స్టేడియంతో పాటు బార్లు, బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన వేలాదిమంది ఈ మ్యాచ్‌ను వీక్షించారు. అనంతరం రెండు రోజులకే లొంబర్డీ ప్రాంతంలోని ఒక ఇటలీ దేశస్థుడికి కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించాయి. అప్పటికే అతను వందలమందితో సన్నిహితంగా మెలిగాడు. ఆ వందలమంది వేలమందికి వైరస్‌ అంటించారు. అటు స్పెయిన్‌లోనూ మ్యాచ్‌కు వెళ్లివచ్చినవారిలో దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించాయి. స్పెయిన్‌లోని వెలన్షియాలో పలువురు అదే లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో అనేకమంది ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు వెళ్లి వచ్చిన వారు లేదా వారి కుటుంబసభ్యులు కావడం గమనార్హం.

పట్టించుకోని ప్రజలు

పట్టించుకోని ప్రజలు

కరోనా మహమ్మారిని గుర్తించిన స్పెయిన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. అయితే ప్రజలు పట్టించుకోలేదు. బార్లకు వెళ్లారు. మార్చి రెండో వారంలో స్పెయిన్‌లో అనేక ప్రాంతాల్లో భారీ ర్యాలీలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు ఇద్దరు స్పెయిన్‌ మహిళా మంత్రులు కూడా హాజరయ్యారు. అనంతరం వీరిద్దరికి కరోనా వచ్చింది. లాక్‌డౌన్‌ పట్టని విద్యార్థులు హాలీడే అని వేల సంఖ్యలో బయటకు వచ్చి యథేచ్చగా తిరిగారు.

మార్చి 13న స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ దేశంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని హెచ్చరించినా ఎవరూ పట్టించుకోలేదు. అనేక ప్రాంతాలు లాక్‌డౌన్‌ను పాటించడంలో అలసత్వం ప్రదర్శించాయి. దీంతో వైరస్‌ వ్యాప్తి అధికం కావడంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. మొదట్లోనే ప్రజలు ప్రభుత్వ హెచ్చిరికలను పట్టించుకొని వుంటే ఇతం నష్టం వాటిల్లివుండేదని కాదని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రోహిత్ బ్రో.. కరోనాపై పర్ఫెక్ట్ షాట్.. నీ అభిమానులుగా గర్వపడుతున్నాం!!

Story first published: Tuesday, March 31, 2020, 16:40 [IST]
Other articles published on Mar 31, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+