Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మార్చి 31: సచిన్‌కు గుడ్ డే.. టీమిండియాకు బ్యాడ్ డే!!

On This Day MS Dhonis India suffer T20 World Cup heartbreak, Sachin Tendulkar scales 10,000

హైదరాబాద్: మార్చి 31 భారత క్రికెట్ జట్టుకు అత్యంత దుర్ధినం అయితే.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అతని అభిమానులకు మాత్రం మరిచిపోలేని రోజు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం (2016 మార్చి 31) ఇదే రోజు భారత అభిమానుల గుండెలు రోదించాయి.

అనూహ్య ఓటమి..

అనూహ్య ఓటమి..

సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్.. వెస్టిండీస్‌‌తో సెమీస్ మ్యాచ్.. పైగా ధోనీ సారథ్యంలోని భారత జట్టు.. ఇంకేముంది మరోసారి ఫైనల్ చేరడం.. ఇంకో కప్ ఖాయం అనుకున్నారంతా..! దానికి తగ్గట్టే రోహిత్ మెరుపులు.. విరాట్ వీరవిహారం.. వెరసి ప్రత్యర్థికి భారీ లక్ష్యం.. ఇక గెలుపే ఆలస్యం అనుకున్నారు. కానీ ప్చ్ ..భారత్ ఓడింది. అవును అనూహ్యంగా ధోనీసేన గెలుపు ముంగిట బొక్కబోర్లాపడింది. 130 కోట్ల ప్రజల ఆశలు గల్లంతయ్యాయి.! విండీస్ వీరులు సూపర్ బ్యాటింగ్‌తో కొండంత లక్ష్యం చిన్నబోయింది. భారత్ భారంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

విరాట్ వీరవిహారం..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు అజింక్యా రహానే, రోహిత్ శర్మ 7.2 ఓవర్లలోనే 62 పరుగులు చేసి అదిరే ఆరంభాన్నిచ్చారు. అనంతరం విరాట్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 47 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 89 పరుగులు చేశాడు. చివర్లో ధోనీ కూడా మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 19.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 196 పరుగులతో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది.

సిమ్మన్స్ మెరుపులు.. రస్సెల్ విధ్వంసం..

సిమ్మన్స్ మెరుపులు.. రస్సెల్ విధ్వంసం..

అయితే 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆ జట్టును ఓపెనర్ జాన్సన్ చార్లెస్(52), లెండి సిమ్మన్స్ (82 నాటౌట్), ఆండ్రూ రస్సెల్ (43 నాటౌట్) ఆదుకున్నారు. చివరి 36 బంతుల్లో విండీస్ విజయానికి 73 పరుగులు అవసరం కాగా.. రస్సెల్, సిమ్మన్ ఆకాశమే హద్దుగా చెలరేగి అద్భుత విజయాన్నందించారు. ఇక చివరి ఓవర్లో 8 పరుగులు కావాల్సి ఉండగా.. ధోనీ సరికొత్త వ్యూహంతో విరాట్‌తో బౌలింగ్ చేయించినా ఫలితం దక్కలేదు. ఈడెన్ గార్డెన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో విజయం సాధించిన విండీస్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌ను గుర్తు చేస్తూ మంగళవారం ఐసీసీ ట్వీట్ చేసింది.

19 ఏళ్ల క్రితం సచిన్ అద్భుతం..

19 ఏళ్ల క్రితం సచిన్ అద్భుతం..

ఇక సరిగ్గా 19 ఏళ్ల క్రితం(2001 మార్చి 31) ఇదే రోజు సచిన్ టెండూల్కర్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలోనే 10 వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో సచిన్ ఈ ఫీట్ అందుకున్నాడు. సచిన్ తర్వాత మరో 14 మంది బ్యాట్స్‌మన్ 10వేల పరుగులు మైలురాయి అందుకున్నారు. 2018లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యంత వేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా సచిన్ రికార్డును బద్దలుకొట్టాడు. సచిన్ 259 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా.. కోహ్లీ కేవలం 205 ఇన్నింగ్స్‌ల్లోనే 10వేల మార్క్‌ను అందుకున్నాడు.

Story first published: Tuesday, March 31, 2020, 15:53 [IST]
Other articles published on Mar 31, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+