Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మెస్సీ కోసం మాకు అన్యాయం చేశారు: ఈజిప్ట్ హెడ్ కోచ్

ఫిఫా నిర్వాహకులపై ఈజిప్ట్ హెడ్ కోచ్ హోసామ్ హసన్ సంచలన ఆరోపణలు చేశాడు. అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ కోసం ఫిఫా అంపైర్లకు తమకు అన్యాయం చేశారని తెలిపాడు. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ను ఫిక్స్ చేశారని ఆరోపించాడు.

మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్ట్‌ను ఓడించింది. అయితే ఈజిప్ట్ ప్లేయర్ జికో 59వ నిమిషంలో గోల్ కొట్టినప్పటికీ.. దానిని ఫౌల్‌గా ప్రకటించడం తీవ్ర దుమారం రేపింది. మ్యాచ్ ముగిసిన తర్వాత.. మీడియా సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ ఈజిప్ట్ కోచ్ హోసామ్ హసన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Clearly a Rigged Match Egypt Coach Hossam Hassan Explodes After Dramatic World Cup Loss to Argentina

'ఈ ఓటమిని దురదృష్టం అని సాదాసీదాగా చెప్పదలుచుకోలేదు. ఈ రోజు మమ్మల్ని దారుణంగా మోసం చేశారు. మాకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎలాంటి పరిణామాలు ఎదురైనా నేను నిజమే మాట్లాడతాను. ఇది స్పష్టంగా ఒక రిగ్గింగ్ మ్యాచ్. ఈ అన్యాయాన్ని ప్రపంచమంతా చూసింది. ఒకవేళ అర్జెంటీనానే గెలవాలని వాళ్లు అంతగా కోరుకుంటే.. మిగతా జట్లను ఎందుకు పిలిచారు.

మెరిసిన మెస్సీ.. గట్టెక్కిన అర్జెంటీనా

మెరిసిన మెస్సీ.. గట్టెక్కిన అర్జెంటీనా

ముస్తఫా జికో చేసిన గోల్‌ను వీఏఆర్ ద్వారా ఫౌల్‌గా ప్రకటించారు. అర్జెంటీనా ప్లేయర్ అలెక్సిస్ మెక్ అలిస్టర్.. ఈజిప్ట్ ప్లేయర్ హమ్దీ ఫాతి జెర్సీని వెనక్కి లాగినా.. మ్యాచ్ రిఫరీలు కనీసం వీఏఆర్ రివ్యూ కూడా చూడకుండా పెనాల్టీ అప్పీల్‌ను తిరస్కరించారు.

మా ఆటగాళ్ల తప్పిదాల వల్ల గోల్స్ వచ్చినా.. మ్యాచ్ బాధ్యతలు చూసే అధికారుల నుంచి మాకు దక్కాల్సిన న్యాయం దక్కలేదు. నేను ఓటమిని అస్సలు తట్టుకోలేను. ఇలాంటి అన్యాయమైన ఓటమి ఎదురైనప్పుడు అభిమానులను బాధపడొద్దని మాత్రమే చెప్పగలను. ఈ అన్యాయానికి నిరసనగా ఈ ప్రపంచకప్‌లో మిగిలిన మ్యాచ్‌లను చూడను. ఇదే నా నిరసన.'అని హసన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

IND vs ENG: 20 ఏళ్లలో ఇదే తొలిసారి..!

IND vs ENG: 20 ఏళ్లలో ఇదే తొలిసారి..!

ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు ఈజిప్ట్ గట్టి పోటీ ఇచ్చింది. మ్యాచ్‌లో 78వ నిమిషం వరకు 2-0తో ఆధిక్యంలో నిలిచింది. దాంతో ఈజిప్ట్ విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా అర్జెంటీనా 14 నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ కొట్టేసి మ్యాచ్‌ను లాగేసుకుంది.

Story first published: Wednesday, July 8, 2026, 13:08 [IST]
Other articles published on Jul 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+