IND vs ENG: 20 ఏళ్లలో ఇదే తొలిసారి..!
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా చెత్త రికార్డ్ నమోదు చేసింది. 20 ఏళ్ల భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే కని వినీ ఎరుగని రీతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లోనూ టీమిండియా చిత్తయ్యింది.
నాటింగ్ హోమ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 125 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత్‌కు ఇది అతిపెద్ద ఘోర పరాజయం. మరోసారి చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్‌తో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా మూల్యం చెల్లించుకుంది.

72 పరుగులకే ఆలౌట్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో రాణించగా.. సామ్ కరణ్(24 బంతుల్లో 4 ఫోర్లతో 41 నాటౌట్) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్(2/30), హర్షిత్ రాణా(2/40) రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం భారత్ 11.4 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇషాన్ కిషన్(13), వైభవ్ సూర్యవంశీ(13), అభిషేక్ శర్మ(10), అక్షర్ పటేల్(10) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3/29) మూడు వికెట్లు తీయగా.. జోష్ టంగ్(4/28) నాలుగు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ఆదిల్ రషీద్(2/14) రెండు వికెట్లు తీయగా.. విల్ జాక్స్(1/5) ఒక వికెట్ పడగొట్టాడు.
20 ఏళ్లలో ఇదే తొలిసారి..
టీ20 చరిత్రలోనే టీమిండియాకు ఇది అతిపెద్ద ఘోర పరాజయం. గతంలో 100 ప్లస్ రన్స్‌తో భారత్ ఎప్పుడూ ఓడలేదు. అంతేకాకుండా వరుసగా 5 టీ20 మ్యాచ్‌ల్లో భారత్ ఒక్క మ్యాచ్ గెలవకపోవడం కూడా ఇదే తొలిసారి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.
టీ20 క్రికెట్‌లో పరుగుల పరంగా భారత్‌కు ఎదురైన అతిపెద్ద పరాజయాలు
125 పరుగుల తేడాతో vs ఇంగ్లాండ్, ట్రెంట్ బ్రిడ్జ్, 2026
80 పరుగుల తేడాతో vs న్యూజిలాండ్, వెల్లింగ్టన్, 2019
76 పరుగుల తేడాతో vs సౌతాఫ్రికా, అహ్మదాబాద్, 2026
51 పరుగుల తేడాతో vs సౌతాఫ్రికా, ముల్లన్‌పూర్, 2025
50 పరుగుల తేడాతో vs న్యూజిలాండ్, విశాఖపట్నం, 2026
(పైన పేర్కొన్న ఐదింటిలో నాలుగు పరాజయాలు డిసెంబర్ 2025 నుండి వచ్చినవే)
టీ20 క్రికెట్‌లో భారత్ నమోదైన అత్యల్ప ఆలౌట్ స్కోర్లు
74 vs ఆస్ట్రేలియా, మెల్బోర్న్, 2008
76 vs ఇంగ్లాండ్, ట్రెంట్ బ్రిడ్జ్, 2026
79 vs న్యూజిలాండ్, నాగ్‌పూర్, 2016
92 vs సౌతాఫ్రికా, కటక్, 2015
101 vs శ్రీలంక, పూణే, 2016
102 vs జింబాబ్వే, హరారే, 2024
టీ20 క్రికెట్‌లో భారత్‌కు అత్యధిక మ్యాచ్‌ల సుదీర్ఘ గెలుపు లేని (విన్‌లెస్) సిరీస్
5* - జూన్ 2026 - జూలై 2026 (4 ఓటములు, 1 ఫలితం తేలలేదు)
4 - జూన్ 2009 - డిసెంబర్ 2009 (4 ఓటములు)
4 - జూలై 2021 - అక్టోబర్ 2021 (4 ఓటములు)
టీ20 క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై నమోదైన అత్యల్ప ఆలౌట్ స్కోర్లు
45 - వెస్టిండీస్, బాస్సెటెర్రే, 2019
47 - ఒమన్, నార్త్ సౌండ్, 2024
55 - వెస్టిండీస్, దుబాయ్, 2021
71 - వెస్టిండీస్, బాస్సెటెర్రే, 2019
76 - భారత్, ట్రెంట్ బ్రిడ్జ్, 2026
79 - ఆస్ట్రేలియా, సౌతాంప్టన్, 2005
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

