Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మెరిసిన మెస్సీ.. గట్టెక్కిన అర్జెంటీనా

డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు పసికూన కేప్ వర్డే చుక్కలు చూపించింది. ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా శనివారం తెల్లవారు జామున జరిగిన నాకౌట్ పోరులో అర్జెంటీనా 3-2 తేడాతో కేప్‌ వర్డే‌ను ఓడించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో సెల్ఫ్ గోల్‌ కేప్ వర్డే కొంపముంచింది. చివర్లో డీనీ బోర్జెస్ దురదృష్టవశాత్తూ చేసిన 'సెల్ఫ్ గోల్' అర్జెంటీనాను గండం నుంచి గట్టెక్కించి.. ప్రిక్వార్టర్స్‌కు చేర్చింది.

మెస్సీ X రొనాల్డో పోరు ఎప్పుడంటే..?

మెస్సీ X రొనాల్డో పోరు ఎప్పుడంటే..?

మెరిసిన మెస్సీ:

కెరీర్‌లో 30వ వరల్డ్ కప్ మ్యాచ్ ఆడిన 39 ఏళ్ల లియోనల్ మెస్సీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ 29వ నిమిషంలో అద్భుత గోల్‌తో అర్జెంటీనాకు తొలి ఆధిక్యాన్ని అందించాడు. ఈ గోల్‌తో ప్రపంచకప్‌లో మెస్సీ గోల్స్ సంఖ్యను 20కి చేరింది.

FIFA World Cup 2026 Argentina Survive Cape Verde Scare as Messi Makes History in Scaloni s 100th Game

తద్వారా వరుసగా 8 వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో గోల్స్ చేసిన ఆటగాడిగా మెస్సీ రికార్డు సాధించాడు. అలాగే రెండు ప్రపంచకప్ ఎడిషన్లలో (2022, 2026) ఏడేసి గోల్స్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా.. నాకౌట్ దశల్లో అత్యధిక గోల్స్ భాగస్వామ్యం (12) అందించిన ప్లేయర్‌గా పీలే, ఎంబాపేల రికార్డులను అధిగమించాడు.

వణికించిన పసికూన కేప్ వర్డే..

ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే తొలి సారి నాకౌట్‌కు అర్హత సాధించిన కేప్ వర్డే.. అర్జెంటీనాకు ఊహించని షాకిచ్చింది. 60వ నిమిషంలో డెరాయ్ డువార్టే అద్భుత గోల్‌తో స్కోరును 1-1తో సమం చేశాడు. నిర్ణీత సమయానికి ఇరు జట్లు సమంగా నిలవడంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది.

మెస్సీ జెర్సీలో టీమిండియా స్టార్ బ్యాటర్.. విచిత్రం ఏంటంటే!(వీడియో)

మెస్సీ జెర్సీలో టీమిండియా స్టార్ బ్యాటర్.. విచిత్రం ఏంటంటే!(వీడియో)

ఉత్కంఠగా ఎక్స్‌ట్రా టైమ్:

ఎక్స్‌ట్రా టైమ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే మెస్సీ కార్నర్ సాయంతో లిసాండ్రో మార్టినెజ్ గోల్ కొట్టి అర్జెంటీనాను 2-1 ఆధిక్యంలో నిలిపాడు. 2006 తర్వాత అర్జెంటీనా తరపున ఒకే వరల్డ్ కప్ మ్యాచ్‌లో గోల్, అసిస్ట్ రెండూ చేసిన తొలి ఆటగాడిగా మార్టినెజ్ రికార్డ్ సాధించాడు. అయితే, కేప్ వర్డే ఆటగాడు సిడ్నీ కాబ్రాల్ 103వ నిమిషంలో నమ్మశక్యం కాని రీతిలో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి స్కోరును 2-2తో సమం చేశాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

ఆట చివరి నిమిషంలో మెస్సీ అందించిన కార్నర్‌ను క్రిస్టియన్ రొమేరో హెడర్ చేయగా.. అది కేప్ వర్డే డిఫెండర్ బోర్జెస్‌కు తగిలి ఓన్ గోల్‌గా మారింది. దాంతో అర్జెంటీనా 3-2తో ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా అద్భుత పోరాటంతో కేప్ వర్డే అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా.. ఈజిప్టుతో తలపడనుంది.

Story first published: Saturday, July 4, 2026, 9:22 [IST]
Other articles published on Jul 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+